తమిళ సూపర్ స్టార్ అజిత్ కు షూటింగ్ లో గాయాలు అయ్యాయి. రిస్కీ బైక్ సీన్స్ చిత్రీకరణ చేస్తున్న సమయంలో అజిత్ ప్రమాదవశాత్తు కింద పడ్డట్లుగా తెలుస్తోంది. ఆయనకు స్వల్ప గాయాలు అవ్వడంతో షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ వేశారట. ఈ సంఘటన సోమవారం జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ను చెన్నై శివారు ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో బైక్ సీన్స్ షూట్ చేస్తున్న సందర్బంగా స్కిడ్ అయినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ లో గాయపడ్డ అజిత్ పావు గంట విశ్రాంతి తీసుకుని ఆ షాట్ ను కంప్లీట్ చేశాడట.
షాట్ ఓకే అయిన తర్వాత అజిత్ హాస్పిటల్ కు వెళ్లాడట. అజిత్ కు చికిత్స అందించిన వైధ్యులు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారట. స్వల్ప గాయాలే అవ్వడం వల్ల ఆ షెడ్యూల్ ను అజిత్ పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. తదుపరి షెడ్యూల్ ను త్వరలో హైదరాబాద్ లో జరిపేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ విషయమై ఆందోళన ఏమీ అక్కర్లేదు అంటూ అజిత్ ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.