పైరసీ ప్రింటును షేర్ చేస్తున్న డాక్టర్లు

Update: 2017-10-20 11:20 GMT
ఇప్పుడు విజయ్ 'మెర్సాల్' సినిమా తమిళనాట కొన్ని ప్రకంపనలను పుట్టిస్తోందనే చెప్పాలి. గతంలో తెలుగులో గణేష్ సినిమా వచ్చినప్పుడు.. అసలు వైద్యవృత్తిని అవమానించారంటూ చాలా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు మెర్సాల్ సినిమాలో కూడా కార్పొరేట్ వైద్యం గురించి ఏకి పారేయడంతో.. చాలా రచ్చే జరుగుతోంది.

అట్లీ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాలో.. అసలు దాదాపు వైద్యులు అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారే కాని.. వైద్యాన్ని అందించట్లేదని.. పేషెంట్లను పట్టించుకోవట్లేదని విజయ్ క్యారక్టర్ చెబుతుంది. ఒక డాక్టర్ క్యారక్టర్ ను స్వయంగా చేసిన విజయ్ పాత్ర ద్వారా.. చాలా పంచులే పేల్చారులే. అయితే తమను ఇంత దారుణంగా అవమానించిన విజయ్ సినిమాపై.. తమిళనాడు డాక్టర్లు కక్ష కట్టేశారు. సినిమాపై అటు కోర్టులోనూ ఇటు మీడియాలోనే ఎటువంటి కంప్లయింట్లు ఇవ్వకుండా.. ఈ సినిమా తాలూకు పైరసీ ప్రింటులను తమ సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా షేర్ చేసి.. సినిమాకు కలక్షన్లు రాకుండా నష్టపరచాలని ప్లాన్ చేశారు. దాన్నే అమలు చేస్తాం అంటూ కొందరు డాక్టర్లు చెబుతున్నట్లు ఒక టాప్ న్యూస్ పేపర్ పేర్కొంది.

ఇప్పటికే పలు డాక్టర్ల సంఘాలు ఒక్కటై.. అసలు మెర్సాల్ సినిమాపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నారట. సినిమా నచ్చకపోతే సెన్సార్ వారికో కోర్టుకో కంప్లయింట్ ఇవ్వాలి కాని.. పైరసీ ప్రింట్ షేర్ చేస్తారా? టూ మచ్ కదూ!!
Tags:    

Similar News