హీరో తనీష్ ఎరక్కపోయి ఇరుక్కున్నాడా? అంటే అవుననే తాజా గొడవలు చెబుతున్నాయి. అతడు నటించిన `రంగు` ప్రస్తుతం కోర్టు వివాదంలో చిక్కుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా బెజవాడకు చెందిన ఎక్స్ రౌడీషీటర్ లారా జీవితకథతో తెరకెక్కుతోందని - రిలీజ్ కి అతడి ఫ్యామిలీ అడ్డుపడుతోందని తెలుస్తోంది.
నేడు రంగు సినిమా వివాదం గురించి ఫిలింఛాంబర్ కి విచ్చేసిన లారా కుటుంబ సభ్యులు సీరియస్ గానే హెచ్చరించారు. అసలు బెజవాడలో రౌడీషీటర్ లే ఉంటారా? ప్రేమికులు ఉండరా? అంటూ బెజవాడ రౌడీషీటర్ లారా కుటుంబ సభ్యుల రచ్చ చేయడం చర్చకొచ్చింది. లారా కుటుంబీకులు ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటామని చెబుతున్నారు. 2000 సంవత్సరంలో కొన్ని అనూహ్య పరిస్థితులు కారణంగా లారాపై రౌడీ షిట్ ఓపెన్ చెసారని ఇదివరకూ విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో చిత్రయూనిట్ చెప్పడం విన్నామని లారా కుటుంబీకులు చెబుతున్నారు. అప్పట్లో ఓ రెండు ఫ్యామిలీల మధ్య జరిగిన స్టోరీతో రంగు సినిమా తీశారని విన్నాం. అయితే దర్శకనిర్మాతలు మమ్మల్ని సంప్రదించకుండానే ఈ సినిమా చేసేశారు. అందుకే రిలీజ్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. విడుదలకు ముందు మాకు చూపించాలి. సినిమా చూసిన తర్వాత ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే సరే... లేదంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం అని లారాకి బావమరిది దిలీప్ హెచ్చరిస్తున్నారు. ``ట్రైలర్ లోనే లారా కనిపిస్తే చంపేయండి`` అని వేశారు. విజయవాడ అంటే కేవలం రౌడీషీటర్లు మాత్రమే కనపడతారా మీకు. గతంలో రామ్‌గోపాల్ వర్మ్ గారు కూడా బెజవాడ అని తీశారు. అక్కడి నుంచి లవ్ స్టోరీలు ఏమీ పుట్టడంలేదా? అని ప్రశ్నించారు. లారాకి కూడా ఫ్యామిలీ ఉందని పిల్లలు చదువుకుంటున్నారని రేపటిరోజున ఇది వాళ్ళ భవిష్యత్తు పై పడుతుందని సీరియస్ అవ్వడం చర్చకొచ్చింది.
విజయవాడ నుంచి వచ్చిన లారా కుటుంబీకులు, ఆయన బావమరిది స్నేహితులు సందీప్, ధనుంజయ్ తదితరులు చాంబర్‌లో మాట్లాడారు. అయితే ఈ సినిమాని వారి కుటుంబానికి చూపిస్తామని చిత్రయూనిట్ మరోవైపు చెబుతోంది. బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత తనీష్ నటించిన రంగు రిలీజ్ కి వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అతడు చేసిన ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడం ఇబ్బందికరమేనన్న ముచ్చటా అభిమానుల్లో సాగుతోంది. తనీష్ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి.