గత రెండు మూడేళ్లలో తెలుగు సినిమా ఎలా ఎదిగిందో చూస్తూనే ఉన్నాం. మన సినిమాలకు జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇంతకుముందు మన సినిమాల్ని పట్టించుకోని బాలీవుడ్ వాళ్ల ఆలోచన తర్వాత మారింది. మన సినిమాల్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఇందుకు ‘బాహుబలి’ ఒక ముఖ్య కారణం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగించింది. బాలీవుడ్ సినిమాలకు గండికొట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘బాహుబలి’ ఎలా హవా సాగించిందో తెలిసిందే. అంత పెద్ద ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ ను ఒక తెలుగు సినిమా చిన్నబోయేలా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ నేపథ్యంలో శేఖర్ కపూర్ లాంటి లెజెండ్.. తెలుగు సినిమాల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని బాలీవుడ్ ఫిలిం మేకర్లకు క్లాస్ పీకాడు కూడా.
ఆయనే కాదు.. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా తరచుగా ఇదే మాట అంటున్నాడు. బాహుబలితో పాటు మరిన్ని తెలుగు సినిమాల్ని ఉదాహరణగా చూపించి ఆయన బాలీవుడ్ మారాలని అంటుంటాడు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్లలో బాలీవుడ్ సినిమాలకు తెలుగు సినిమాలు ఎలా గండికొడుతున్నాయో ఉదాహరణలతో వివరించాడు. 40 రోజుల వ్యవధిలో ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘మహానటి’ సినిమాలు అమెరికాలో వసూళ్ల మోత మోగించాయని.. ఏకంగా 9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టాయని.. బలమైన కంటెంట్ ఉంటే సినిమాలు ఎలా ఆడతాయో చెప్పడానికి ఇది ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇక్కడే కాక ఆస్ట్రేలియాలో సైతం తెలుగు సినిమాల హవా సాగిందని.. ఇక్కడ మామూలుగా బాలీవుడ్ సినిమాలకే పెద్ద పీట వేస్తారని.. కానీ వాటిని తెలుగు సినిమాలు డామినేట్ చేశాయని ఆయన అన్నారు. ఓవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లలో బాలీవుడ్ సినిమాలపై తెలుగు సినిమాలు ఆధిపత్యం సాగిస్తుంటే.. డొమెస్టిక్ మార్కెట్లో హాలీవుడ్ సినిమాలు హిందీ సినిమాల్ని వెనక్కి నెడుతున్నాయని ఆయన అన్నారు. ఈ పరిణామాలు చూసి బాలీవుడ్ మేల్కోవాలని తరణ్ అభిప్రాయపడ్డారు.