బాలీవుడ్ క్రిటిక్ అంతమాటనేశాడు

Update: 2017-06-25 10:30 GMT
ఇప్పటికే  బాహుబలి 2 సినిమాతో బాలీవుడ్ హీరోలుకు అక్కడ ఫిల్మ్ మేకర్స కు గట్టి సవాలునే విసిరింది టాలీవుడ్. ఆ బాహుబలి పంచ్ నుండి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు బన్నీ దువ్వాడ జగన్నాధం తో మరో పంచ్ ఇచ్చాడు. అందుకే బాలీవుడ్ లో క్రిటిక్ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేసి బాలీవుడ్ కి నిద్రమత్తు వదలమని సలహా ఇచ్చాడు.

ఈ ఏడాది తెలుగు సినిమాతో దేశం లో ఒక సంచలనం జరిగింది. ఇంతవరకు ఎన్నడూ జరగని కలెక్షన్లు తెచ్చిపెట్టింది బాహుబలి2. బాహుబలి చేసిన కలెక్షన్లు ఇప్పటిలో ఏ ప్రాంతపు సినిమా కూడా అందుకోలేనంత మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమా విడుదలై మంచి కలెక్షన్లు తోనే నడుస్తుంది. తరణ్ ఆదర్శ్ ఇదే విషయాన్ని ఇలా ట్వీట్ చేశాడు “ డియర్ బాలీవుడ్ మేల్కొండి, మొదట బాహుబలి2 ఇప్పుడు దువ్వాడ జగన్నాధం తెలుగు సినిమా అమెరికా మార్కెట్ లో దూసుకుపోతుంది. దువ్వాడ జగన్నాధం ఇప్పటికే 3.39 కోట్లు కలెక్షన్ చేసింది” అని అన్నాడు. ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్యూబు లైట్ సినిమా కన్నా బెటర్ కలెక్షన్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఒక టాప్ క్రిటిక్ అండ్ ట్రేడ్ వ్యక్తి ఇలా కామెంట్ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.

దీనిపై వివరణ ఇచ్చిన తరణ్‌.. ఇలాంటి ప్రాంతీయ సినిమాల విజయాలు చూసైనా బాలీవుడ్లో ఫిల్మ్ మేకర్స్ మరిన్ని మంచి సినిమాలు తీస్తారని  వస్తాయని ఆశిస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబు లైట్’  బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత ఫలితాలు ఇవ్వలేక పోయింది. సినిమా రిలీజ్ కు ముందు మనోడు నాకు 1 స్టార్ ఇచ్చినా పర్లేదు అనడం.. ఇప్పుడు ఒక తెలుగు సినిమాకంటే తక్కువ వసూలు చేయడం.. బాలీవుడ్ ను కలవరపెడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News