ఒక్కోసారి లైఫ్ ఎలా ఉంటుందంటే.. ఇక్కడ దర్శకుడు అవుదాం అని వచ్చిన రవితేజ పెద్ద హీరో అయ్యాడు. అలాగే రైటర్ అవుదామని వచ్చిన వెన్నెల కిషోర్ కమెడియన్ అయ్యాడు. యాక్టర్ అవుదామనుకున్న సురేష్ బాబు నిర్మాత అయిపోయాడు. ఎడిటింగ్ చేద్దాం అనుకున్న రాజమౌళి దర్శకుడు అయిపోయాడు. ఇదంతా ఒకెత్తయితే.. కొంతమంది తమలో ఉన్న కోరికను తమ పిల్లలు పెద్దాయక తీర్చుకుంటుంటారు. అలాగే ఇప్పుడు ఒకావిడ యాక్టర్ అయ్యింది.
'పెళ్ళిచూపులు' డైరక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నాడు చూడండి.. అతగాడి తల్లి గీతా భాస్కర్ కి యాక్టింగ్ అంటే ఇష్టమట. అయితే తన 28 ఏళ్ళ కొడుకు ఒక నోటెడ్ డైరక్టర్ అయ్యేవరకు ఆ కల తీరలేదు. ఆల్రెడీ ఆమె తరుణ్ తీసిన షార్ట్ ఫిలింస్ లో నటించింది కూడా. అయితే అవన్నీ చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఎందుకో ఈవిడకు ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే బాగుంటుందని ఫీలై.. చిన్న ఆడిషన్ చేసి. తన ''ఫిదా'' సినిమాలో ఒక ఛాన్సిచ్చేశాడు. ''పెళ్ళిచూపులు డైరక్టర్ వాళ్ళ మథర్ అని ఎవ్వరూ చెప్పరు. ఈవిడ కొడుకు అతను అని చెప్పుకుంటారు. అలాంటి ఇంప్రెసివ్ అత్తమ్మ క్యారక్టర్ చేశారావిడ. చూస్కోండిక'' అంటూ శేఖర్ కమ్ముల స్వయంగా చెప్పేశాడు. మరి నిజంగానే గీత ఈ సినియర్ వయస్సులో ఒక టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటారా? చూద్దాం.
చాలామంది నిర్మాతలుగా మారి.. రెండు సినిమాలు హిట్టయ్యాక.. అప్పుడు వారే హీరోలుగా చేస్తుంటారు. అలాగే ఇప్పుడు తరుణ్ పెద్ద డైరక్టర్ గా తన ముద్రను వేసుకుంటున్న క్రమంలో.. అతని తల్లి ఇలా యాక్టర్ మారడం.. అదొ క్రేజీ థింగ్ లా అనిపిస్తోంది కదూ.