నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ''అఖండ'' సూపర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ పేరుకు తగ్గట్టే అఖండమైన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ బాలయ్య సినిమా దుమ్ము దులుపుతోంది.
'అఖండ' సినిమా ఇప్పటికే 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి.. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓవర్ సీస్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా యూఎస్ తెలుగు సినిమా మార్కెట్ లో మిలియన్ మార్క్ అందుకున్నట్లు అయింది. ఊర మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన బోయపాటి ఈ సినిమా ద్వారా తొలిసారిగా మిలియన్ డాలర్లు వసూళ్లు దక్కించుకున్నాడని తెలుస్తోంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఖండ ఖండాల వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ 1 మిలియన్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 'అఖండ' చిత్రాన్ని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు మంగళవారం బోయపాటి శ్రీను - నిర్మాత రవీందర్ రెడ్డి లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆఫీస్ లో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేసారు.
ఇకపోతే బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ 'అఖండ'.. కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా.. బాలయ్య కెరీర్ లోనే అఖండమైన విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయానికి అఘోరా గా బాలకృష్ణ అద్భుతమైన నటనతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు.
''అఖండ'' చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ - నితిన్ మెహతా - కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయిన ఈ చిత్రం లాభాల బాట పట్టింది. లాంగ్ రన్ పూర్తయ్యే సరికి మాస్ జాతర ఎక్కడ వరకు వచ్చి ఆగుతుందో చూడా