ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం గోపీచంద్ తో అలిమేలుమంగ వెంకటరమణ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత రానాతో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వ్యవహారాలతో బిజీగా ఉన్న దర్శకుడు తేజ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రాజెక్ట్ గురించి మరింత క్లారిటీ వచ్చింది. దర్శకుడు తేజ నిర్మాణంలో ఆ వెబ్ సిరీస్ రూపొందిందట.
తన వద్ద సుదీర్ఘ కాలంగా సహాయ దర్శకుడిగా చేస్తున్న రాజేష్ తో ఈ వెబ్ మూవీని తేజ నిర్మించాడట. ఇందుకు గాను కథను మరియు స్క్రిప్ట్ ను స్వయంగా తేజానే ఇచ్చాడట. గంట నిడివి ఉండేలా రాజేష్ సినిమాను తెరకెక్కించాడు. నైజాం కాలం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ బోల్డ్ కంటెంట్ తో ఉంటుందని అనధికారిక సమాచారం అందుతోంది.
బోల్డ్ కంటెంట్ అవ్వడం వల్ల తన పేరు వేసుకోకుండా శిష్యుడి పేరును వేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దర్శకుడు తేజ ఈ వెబ్ మూవీతో ఒక అద్బుతమైన ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తాడని అంటున్నారు. ప్రముఖ ఓటీటీలో ఇది వచ్చే నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.