ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రెండో కుమారుడు, హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ''అహింస''. విభిన్న నేపథ్యాలతో అనేక ప్రేమకథా చిత్రాలను విజయవంతంగా రూపొందించిన క్రియేటివ్ జీనియస్ తేజ ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న "అహింస" సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మరియు ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను ఆవిష్కరించారు. అహింసా సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తిని హింస కలిసినప్పుడు ఏమి జరుగుతుంది? అనే పాయింట్ తో రూపొందిన తేజ మార్క్ లవ్ స్టొరీ అని తెలుస్తోంది.
రఘు (అభిరామ్) జీవితంలో పెద్ద కలలు లేని ఉన్నదాంట్లో సంతోషంగా జీవించాలనుకునే ఒక యువ రైతు. అంతేకాకుండా, అతను హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని బోధించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెప్తున్నాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
బలమైన పాయింట్ తో తేజ ఒక అందమైన ప్రేమకథను చెప్పబోతున్నాడని టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఇది రఘు - అహల్య వంటి ఇద్దరు అమాయక ఆత్మల అందమైన ప్రేమకథను ప్రదర్శిస్తోంది. ఇందులో అభిరామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. హీరోయిన్ గీతిక అహల్యగా ఆకట్టుకుంది. టీజర్ లో సీనియర్ హీరోయిన్ సదా మరియు మరికొన్ని ప్రధాన పాత్రలు కూడా ఉన్నాయి.
ఆర్‌పి పట్నాయక్ తన ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేమకథకు అందాన్ని జోడించాడు. అలానే యాక్షన్ పార్ట్ కి కూడా సరైన మూడ్ ని సెట్ చేశాడు. తేజ మరియు ఆర్పీ చాలా కాలం తర్వాత కలిసి చేసిన చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి కెమెరా పనితనం అత్యున్నతంగా ఉంది. మొత్తం మీద ఇది తేజ మార్క్ సినిమా అని భరోసా ఇస్తుంది. సినిమాపై అంచనాలను కలిగిస్తుంది.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ "అహింస" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటర్ గా వర్క్ చేయగా.. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అనిల్ అచ్చుగట్ల మాటలు.. చంద్రబోస్ పాటలు అందించారు.
ఈ సినిమాలో రజత్ బేడీ - రవి కాలే - కమల్ కామరాజు - మనోజ్ టైగర్ - కల్పలత - దేవి ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'అహింస' చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది కొత్తవాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ.. ఇప్పుడు దగ్గుబాటి వారసుడికి ఎలాంటి సక్సెస్ అందిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View