ఇప్పటివరకు నందమూరి తారక రామారావు జీవితచరిత్రపై అదిగో సినిమా ఇదిగో సినిమా అంటూ వార్తలు రావడమే కాని.. వాటిపై క్లారిటీ మాత్రం లేదు. అయితే స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు బాలకృష్ణ అనేకసార్లు చెప్పడంతోపాటు.. ఎన్టీఆర్ జీవితంలో ఉన్న కాంట్రోవర్శీలు ఆ సినిమాలు ఉండవని కూడా తెలిపారు. ఆ తరువాత ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తాడని టాక్ వచ్చింది. కాని బాలయ్య ఖండించారు. అయితే ఇంతలో రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీ పార్వతి పాయింటాఫ్ వ్యూ నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు తెలిపాడు. ఈ మద్యలో బాలయ్య తను తీయబోయే ఎన్టీఆర్ సినిమాకు తేజను దర్శకుడిగా ఎంచుకున్నారని మరో టాక్ వచ్చింది.
వీటన్నింటిలో ఏది నిజం ఏది కాదు అని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్న వేళ.. నన్ను బాలయ్య నిజంగానే పిలిపించి మాట్లాడారు.. అంటూ దర్శకుడు తేజ అసలు విషయం చెప్పేశాడు. ''నిజానికి ఓ నాలుగైదు సార్లు ఈ సినిమా గురించి పిలిపించి మాట్లాడారు. కాని ఎన్టీఆర్ జీవిత చరిత్రను హ్యాండిల్ చేయాలంటే నాకే కొంత ఉత్కంఠగా ఉంది. నేను బేసిక్ గా ఎన్టీఆర్ ఫ్యాన్ అయినప్పటికీ.. సినిమా విషయానికి వచ్చేసరికి కాస్త ఆందోళన చెందాల్సిందే. అయితే ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టుల తాలూకు చర్చలు నడుస్తున్నాయి. వీటిలో ఏది ముందుకు వెళ్తుందో తెలియదు కాని.. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం నేను తీసే ఛాన్సుంది'' అంటూ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తేజ తెలిపాడు.