క్వీన్ కంగన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే జయలలిత బయోపిక్ `తలైవి` చిత్రీకరణను ముగించి తదుపరి భారీ యాక్షన్ సినిమాల చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తోంది.
కంగనా తదుపరి చిత్రం `తేజస్` త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా తేజస్ చిత్ర బృందం ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఆశీస్సులు కోరారు. ఈ సమావేశం ఫోటోల్ని ట్విట్టర్లో పంచుకున్న కంగన ఏ ఉద్ధేశంతో ఆయనను కలిసారో వివరించారు. తేజస్ చిత్రం కోసం పెద్దాయన ఆశీర్వాదం కోరినట్లు చెప్పారు. ఈ చిత్రంలో కంగన భారత వైమానిక దళ పైలట్ పాత్రలో నటిస్తున్నారు.
కంగనా తన ట్వీట్ లో తేజస్ స్క్రిప్ట్ ను భారత వైమానిక దళంతో పంచుకున్నామని.. కొన్ని అనుమతులు కూడా కోరామని చెప్పారు. తేజస్ చిత్రానికి సర్వేష్ మేవారా -రోనీ స్క్రూవాలా నిర్మాతలు. సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సైనికురాలి పాత్రలో నటించాలన్నది నా చిరకాల కోరిక. నేను చిన్నప్పటి నుండి సాయుధ దళాల పట్ల ఆకర్షితురాలినయ్యాను. జవాన్ల విషయంలో ఎప్పుడూ నా భావోద్వేగాలను ఆపుకోలేదు. వారి వీరత్వం పై నా మాటను ప్రతిసారీ వినిపిస్తూనే ఉన్నాను. దేశాన్ని సురక్షితంగా ఉంచేది సైనికులే. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది`` అని అన్నారు.