వీడియో : తేజస్వి ఊర మాస్ డాన్స్ వైరల్‌

Update: 2022-12-16 04:26 GMT
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షంచిన అమ్మాయి తేజస్వి మదివాడ. ఆ సినిమా తర్వాత తేజస్వి కి పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్ని హీరోయిన్ పాత్రలు కూడా ఉన్నాయి. బుల్లి తెర మరియు వెండి తెరపై ఒక మంచి ఇమేజ్ తో ముందుకు సాగుతున్న సమయంలో బిగ్‌ బాస్ ఆఫర్‌ ఈ అమ్మడి తలుపు తట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడి కి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తప్పలేదు. నెగిటివిటీ ఎక్కువగా మూట కట్టుకున్న ఈ అమ్మడు పాపం బిగ్ బాస్ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.. అలాగే టీవీ షో ల్లో కూడా కనిపించలేదు. కేవలం సోషల్‌ మీడియా ద్వారా అప్పుడప్పుడు సందడి చేస్తూ వస్తోంది.

హీరోయిన్‌ గా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎప్పటికప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అందాల విందు విషయంలో స్టార్‌ హీరోయిన్ ల కంటే ఈమె తక్కువేం కాదు అని పలు సార్లు నిరూపించింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన ఆప్తుడు రోహన్‌ యొక్క పెళ్లి వేడుకలో బారత్‌ లో తేజస్వి యొక్క లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆమె చేసిన డాన్స్ సందడి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పెళ్లికి సింపుల్‌ అండ్ స్వీట్‌ గా ఎల్లో చీర కట్టుకుని.. కనిపించి కనిపించనట్లుగా నడుము చూపిస్తూ ఊర మాస్ డాన్స్ వేస్తున్న తేజస్విని అలాగే చూస్తూ ఉండి పోతారు.

పక్కన ఉన్న ఏ ఒక్కరిని కూడా చూడకుండా ఒకటికి రెండు సార్లు తేజస్విని మరియు ఆమె డాన్స్ ను నెటిజన్స్ చూస్తున్నారు. ఇన్‌ స్టా లో ఈ వీడియోను షేర్ చేసిన తేజస్వి 8 సంవత్సరాల తర్వాత శ్రేయాన్స్‌ ను కలిశాను.. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఉంది.. ఏమీ మారలేదు అన్నట్లుగా తేజస్వి కామెంట్‌ పెట్టింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News