ఆన్ లైన్ టిక్కెట్టు దోపిడీ.. మంత్రి షాడో డీలింగ్

Update: 2019-09-23 10:21 GMT
అయిన‌ దానికి కాని దానికి దోపిడీ చేస్తే ఇలాగే ఉంటుంది మ‌రి. ఆ ఫీజు ఈ ఫీజు అంటూ అడ్డ‌గోలు ఎక్స్ ట్రా ఛార్జీలతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్ట‌ల్స్ దోపిడీ గురించి తెలిసిందే. ఈ అత్యాశ‌కు అంత‌మిదే. నిలువు దోపిడీకి చ‌ర‌మ‌గీతం పాడ‌బోతున్నారు. దోచుకునేవాళ్ల‌ను ఎన్నాళ్ల‌ని భ‌రిస్తారు? అందుకే దోపిడీకి చెక్ పెట్టేసేందుకు డైరెక్టుగా ప్ర‌భుత్వమే రంగంలోకి దిగింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో అడ్వాన్స్ డ్ డెసిష‌న్స్ తీసుకుంటూ ఆన్ లైన్ టికెటింగ్ పోర్ట‌ళ్ల‌కు ముకుతాడు వేయ‌బోతోంది.

ఇన్నాళ్లు మూవీ టిక్కెట్టు బుక్ చేయాలంటే బుక్ మై షో.. పేటీఎం.. ఇంకా ప‌లు ప్ర‌యివేటు పోర్ట‌ళ్ల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చేది. అక్క‌డ ఏం జ‌రుగుతోందో ఎవరికీ తెలీదు. అడ్డ‌గోలుగా ఒక్కో టిక్కెట్టుపై రూ.40-50 మినిమం బాదుడుకు తెగ‌బ‌డుతున్నా సామాన్యుడు అడ‌గ‌లేని దుస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి స్వ‌యంగా అధికారుల‌తో క‌లిసి అధ్య‌య‌నం చేసి రివ్యూలు చేశారు. చివ‌రికి ఈ ప్ర‌యివేటు దందాకు ముఖం వాచేలా తెలంగాణ ప్ర‌భుత్వ‌మే సొంతంగా ఒక పోర్ట‌ల్ ని ర‌న్ చేయాల‌ని నిర్ణయించుకుందిట‌. ఇందుకోసం టాలీవుడ్ కి చెందిన ఓ న‌లుగురు న‌టుల‌తో క‌లిసి తెలంగాణ మంత్రి కుమారుడు ప్ర‌భుత్వ‌ పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు ప్లాన్ చేశార‌ట‌. దీని ద్వారా దోపిడీని అరిక‌ట్టాల‌న్నది ప్లాన్.

ప్ర‌భుత్వమే ఈ పోర్టల్ ని అధికారికంగా లాంచ్ చేస్తోంది కాబ‌ట్టి ఆ మేర‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. టిక్కెట్టు ద్వారా వ‌సూల‌య్యే జీఎస్టీ విష‌యంలోనూ పూర్తి క్లారిటీ ఉంటుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే స‌ద‌రు తెలంగాణ సీనియ‌ర్ మంత్రి వార‌సుడు బ‌రిలో దిగి ఆ న‌లుగురు న‌టుల్ని సంప్ర‌దించార‌ట‌. అయితే ఇదంతా న‌డిపిస్తున్న ఆ మంత్రిగారి కుమారుడెవ‌రు? ప‌్ర‌భుత్వ ప‌న్ను వ‌సూల్ స‌రిగా లేక‌నే ఇలా చేస్తున్నారా? అస‌లెందుకు ఇదంతా అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

అంతా బాగానే ఉంది కానీ.. ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో అంటే పోర్ట‌ల్ చాలా ప‌క‌డ్భందీగా రూపొందించి జ‌వాబుదారీ త‌నం ధీటుగా ఉండాల్సి ఉంటుంది. నిర్ల‌క్ష్యం.. ఏమ‌రుపాటు అస్స‌లు ఏమాత్రం కుద‌ర‌దు. లేదంటే అమెరికాలో `మూవీ పాస్` (యాప్) మూసేసిన‌ట్టే మూసేయాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఆశిద్దాం.



Tags:    

Similar News