తెలుగు ప్రజలతో పాటు.. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటింగ్ మూవీగా మారిన బాహుబలిని చూసేందుకు థియేటర్లకు పెద్ద ఎత్తున పోటెత్తటం ఖాయమంటున్నారు. తెలుగు పండగల్లో తాజాగా చేరిన బాహుబలి పండగ హడావుడి ఒక రేంజ్లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. బాహుబలికి ప్రత్యేక అనుమతి కోసం చిత్ర నిర్మాత ప్రసాద్.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు.
ఈ సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో.. ఈ సినిమాను రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే బాహుబలి సినిమాకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పిన తలసాని.. ఈసినిమాను రోజుకు ఐదు ఆటలు వేసుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు నిర్మాతలు కోరిన మినహాయింపులు.. అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా వెల్లడించారు. తాజాగా తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని స్వయంగా పేర్కొన్న మాటతో బాహుబలి నిర్మాతలకే కాదు.. సినీ అభిమానులకు కూడా పండగేనని చెప్పక తప్పదు. సో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. బాహుబలిని రోజుకు ఐదు ఆటలు వేసేస్తారన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/