హమ్మయ్య.. వాయిదా పడింది

Update: 2017-07-01 04:18 GMT
కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై ఓ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం.. థియేటర్ల యాజమాన్యాలు.. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలను కొంతమేర పెంచుకునే అవకాశం లభించింది. జీఎస్టీ అమలుతో లింక్ ఉన్న ఈ జీవోను.. ఇప్పుడు వెనక్కు తీసుకున్నారని తెలుస్తోంది.

జూలై 1 తెల్లవారు ఝాము నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. అంతకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది సినీ ప్రేక్షకులకు కొంతమేర ఊరటగా చెప్పచ్చు. చిన్న నిర్మాతలకు కూడా ఇది కాసింత ఊపిరులూదే విషయమే. మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లను 150 నుంచి 200లకు.. సింగిల్ స్క్రీన్స్ లో గరిష్టంగా 120 రూపాయలకు రేట్లను పెంచుకునేందుకు ఇచ్చిన సౌలభ్యం.. ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది.

నేల.. బెంచీ టికెట్స్ ను కూడా పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవోపై విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి వినోదం దూరమవుతోందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో పాటు అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఇంతమంది నుంచి వ్యతిరేకత వస్తుండడంతో.. ఈ జీవోను వెనక్కు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని అంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News