నాపై పెళ్లికి ముందే రేప్ చేశాడు.. బుల్లితెర నటి సంచలన ఆరోపణ

Update: 2021-11-11 05:30 GMT
ఈ ఆధునిక కాలంలో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. మునుపటిలా ‘వర్జిన్’గా ఎవ్వరూ ఉండడం లేదని సమాజ పోకడలు చూస్తే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వంటి నగరాల్లో ఇఇంకా పరిస్థితులు దిగజారిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి.

తాజాగా ఓ బుల్లితెర నటి సంచలన ఆరోపణలు చేసింది. తనపై పెళ్లికి ముందే ఆరు సార్లు లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఈ మేరకు భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఈ ఘటన పక్కనున్న కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇక వీరి పరిచయం, ప్రేమ, అత్యాచారం విషయానికి వస్తే..

వాళ్లిద్దరూ బుల్లితెర, వెండితెర నటులు. ఆయా రంగాల్లో రాణించాలని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయమైంది. బుల్లితెర నటికి అవకాశాలు ఇప్పిస్తానని అతడు నమ్మబలికాడు. ఈ క్రమంలోనే కలవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అతడిని తన ఇంటికి ఆమె ఆహ్వానించింది. ఇద్దరూ ఇష్టంతోనే శారీరకంగా దగ్గరయ్యారు. అనేకసార్లు ఇద్దరూ లైంగిక చర్యల్లో తరుచుగా పాల్గొన్నారట.. పెళ్లి ప్రస్తావన తేవడంతో మన నటుడు నటించడం మొదలుపెట్టాడట.. తప్పించుకోవాలని చూశాడట..

వాంఛలు తీర్చుకోవడంతో ఇక ఆ నటితో పనిలేదని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఆమె విడిచిపెట్టలేదు. అనేక రకాలుగా ఒత్తిళ్లు తేవడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే అత్తింటి వారింటికి బుల్లితెర నటి వెళ్లింది. బలవంతంగా తమ కొడుకును చేసుకున్న నటిని అత్తింటివారు సాధించడం మొదలుపెట్టారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా విడిపించుకోవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కట్నం తేవాలని వేధించసాగారు. కులం పేరుతో దూషించారట..

ఇలా శారీరకంగా, మానసికంగా తీవ్ర అనారోగ్యంతో నటి ఆస్పత్రి పాలైంది. ఈ క్రమంలోనే భర్త అత్తమామలపై విసిగి వేసారి.. పెళ్లికి ముందే తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




Tags:    

Similar News