అంత డబ్బులు అందరూ పెట్టలేరుగా!!

Update: 2016-03-29 16:55 GMT
మనం చెప్పుకోవడానికి తెలుగు దర్శకులు తీసిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. మిస్సమ్మ నుండి బాహుబలి వరకు ఏ సినిమాకు ఆ సినిమాయే. కాని బాహుబలి సినిమాకు తొలిసారి 63 యేళ్ళ తరువాత నేషనల్‌ అవార్డు రావడం అనేది చాలా విస్మయానికి గురిచేసింది సినీ లోకాన్ని.

ఏకంగా 150 కోట్లు పైగా ఇన్వెస్టు చేసి ఒక సినిమా తీస్తే.. దానికి తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి నేషనల్‌ అవార్డు వచ్చింది. మరి అందరూ అంత డబ్బులు పెట్టి అలాంటి సినిమాలు తీయలేరుగా.. అలాగే ఇప్పటివరకు వేరే బాషల్లో నేషనల్‌ అవార్డులు అందుకున్న సినిమాలేవీ ఇంత బడ్జెట్‌ తో తీసిన ఆణిముత్యాలు కానే కాదు. మరి తేడా ఎక్కడుంది? ఎక్కడా అంటే కంటెంట్‌ లోనే ఉంది. బడ్జెట్‌ ఎంత పెట్టారు అనేకంటే.. కంటెంట్‌ ఎలా ఉంది అనేదే జాతీయ అవార్డును గ్రహించడానికి ఉపయోగపడుతుంది. కంటెంట్‌ బాగుంటూ.. విమర్శకులను కూడా ఇంప్రెస్‌ చేస్తే.. ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది.

రాజమౌళి ఎంచుకున్న ఈ కంటెంట్‌ కు అంత ఖర్చయ్యింది కాని.. ఒకవేళ ఇదే డైరక్టరు తన క్యాలిబర్‌ కు తగ్గట్లు కంటెంట్‌ రాసుకొని తక్కువ బడ్జెట్‌ తో సినిమాను చేసినా కూడా దానికి మాంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డులు కూడా వచ్చే ఛాన్సుంది. ఒకప్పటిలాగా ఇప్పుడు అవార్డు సినిమా కమర్హియల్‌ సినమా అంటూ తేడా లేదు. ఇంప్రెస్‌ చేస్తే ఏ సినిమాకైనా అవార్డు రావొచ్చు. సో.. మిగిలిన డైరక్టర్లందరూ ఆలోచించుకోండి మరి.
Tags:    

Similar News