సినిమా పరిశ్రమలో వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుని సక్సెస్ లను దక్కించుకున్న వారే రాణించగలరు. ఈ విషయం పలువురి విషయంలో నిరూపితం అయ్యింది. కాని కొందరు దర్శకులు మాత్రం వచ్చిన అవకాశంను వదిలేసి, మరో అవకాశం కోసం, పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దర్శకులు ఎంతో మంది రెండు మూడు సినిమాలకే కనుమరుగు అయ్యారు. ఒక్క చిత్రం సక్సెస్ కాగానే స్టార్ హీరోతో అయితేనే సినిమా చేస్తాను అంటూ పట్టుబట్టి కూర్చున్న పలువురు దర్శకులు అవకాశాలు లేకుండా పోయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇప్పటికి కూడా కొందరు దర్శకులు తప్పు చేస్తున్నారు. ఆ దర్శకులు అంతా కూడా మారుతిని చూసి నేర్చుకోవాలంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈరోజుల్లో’ చిత్రంతో ప్రేక్షకులు పరిచయం అయిన దర్శకుడు మారుతి ఆ తర్వాత ‘బస్ స్టాప్’ చిత్రంతో రెండవ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుసగా రెండు విజయాలు దక్కడంతో తాను పెద్ద హీరోతో అయితేనే సినిమాను చేస్తాను అంటూ కూర్చోకుండా వెంటనే మరో చిన్న హీరో, కొత్త హీరో అయిన సుధీర్ బాబుతో సినిమాను చేయడం జరిగింది. అలా మారుతి ఇప్పటి వరకు చేసిన సినిమాలను చూస్తుంటే ఆయన స్టార్ హీరోల కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించడం లేదు. తాజాగా అదే విషయాన్ని మారుతి కూడా చెప్పుకొచ్చాడు.
మారుతి మాట్లాడుతూ.. నాకు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంటుంది. కాని స్టార్ హీరోల కోసం ఎదురు చూసి టైం వృదా చేసుకోను. నాతో సినిమా చేయడానికి వచ్చే హీరోతో నేను సినిమాను చేస్తాను. భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత శర్వానంద్ నాతో సినిమాకు ఆసక్తి చూపించాడు. ఆయనతో మహానుభావుడు చిత్రాన్ని చేశాను. ఆ తర్వాత నాగచైతన్య నాతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో శైలజారెడ్డి అల్లుడు చేశాను. ఇలా నాతో సినిమాలు చేసేందుకు వచ్చిన హీరోలతో సినిమాలు చేస్తున్నాను. స్టార్ హీరోల కోసం వచ్చిన చిన్న హీరోలను పక్కన పెట్టాలని నాకు లేదు అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.
మారుతి మాదిరిగా ప్రస్తుతం యువ దర్శకులు అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు ఒక మోస్తరు సక్సెస్ లు దక్కగానే ఎన్టీఆర్ - మహేష్ బాబు వంటి వారితో సినిమాలు చేయాలని కలలు కంటూ ఉంటారు. కలలు కనడం పర్వాలేదు, కాని అది సాధ్యం కానప్పుడు చిన్న హీరోలతో సర్దుకుంటేనే కెరీర్ లో ముందుకు వెళ్లగలుగుతారు అనే విషయాన్ని మారుతి నుండి నేర్చుకోవాలంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.