రిలీజ్ దగ్గరైన ఓ మీడియం రేంజ్ సినిమా టైటిల్ వింటేనే హడలెత్తిపోతున్నారట టాలీవుడ్ డిస్ట్రీబ్యూటర్లు. ఎందుకంటే ఎవరైన బిజినెస్ కోసం ఆ సినిమా ఆఫీస్ కి వెళితే వారు చెప్పే లెక్కులు చుక్కల్ని తాకేలా ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఓ బిలో మీడియం రేంజ్ హీరోతో సినిమాను ప్లాన్ చేయడమే ఓ పెద్ద మిస్టేక్ అనుకుంటే దీనికి కొనసాగింపుగా ఆ చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారంటూ ఓవర్ పబ్లిసిటీ కూడా చేయడం విశేషం. నిజానికి ఆ చిత్రాన్ని ప్రచారం చేస్తున్నంత బడ్జెట్ తో నిర్మించపోయినా, కచ్ఛితంగా ఈ ప్రాజెక్ట్ ఓ కాస్ట్ ఫెయిల్యూర్ అనే సందేహం మొదటి నుంచి ఇండస్ట్రీలో జనాల్లో ఉంది.
ఈ సందేహాలకి మరింత ఊతం ఇచ్చేలా గత వారం రోజులు నుంచి ఆ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయట. టీజర్ - ట్రైలర్ చూసి సినిమాను కొందామని వస్తున్న పంపిణీదారులకి ఆ సినిమా బిజినెస్ టీమ్ ఇచ్చే కొటేషన్స్ భారీ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. దీంతో చాలా చోట్ల ఈ సినిమా బిజినెస్ జరగలేదని తెలిసింది. అయితే మరోవైపున తమ ప్రాజెక్ట్ ఫ్యాన్సీ రేట్లకి అమ్ముడైందని ఆ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. మరి బయ్యర్స్ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆ సినిమా రేపొద్దున్న ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.