శ్రీమంతుడు విజయానికి 10 కారణాలివే

Update: 2015-08-13 12:17 GMT
మహేష్‌ నటించిన శ్రీమంతుడు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. రిలీజైన తొలి రోజు నుంచే సక్సెస్‌ టాక్‌ తో వసూళ్ల దూకుడు సాగించింది ఈ సినిమా. ఇప్పటికీ వసూళ్ల రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీమంతుడు 5 రోజుల్లో 70 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇంత పెద్ద హిట్టవ్వడానికి కారణమేంటి? ఓ పది కారణాల్ని పరిశీలిస్తే ఇలా ఉన్నాయి....

=మహేష్‌ ఛరిష్మా. మైండ్‌ బ్లోవింగ్‌ పెర్ఫామెన్స్‌ ఈ సినిమాకి పెద్ద అస్సెట్స్‌. సాలిడ్‌ గా నటించాడన్న పేరొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకానొక బెస్ట్‌ పెర్ఫామర్స్‌ లో మహేష్‌ ఒకడు అని మరోసారి ప్రూవ్‌ చేసిందీ చిత్రం.

=కథాంశం చాలా సింపుల్‌ గా ఉంది. కన్ఫ్యూజన్స్‌ లేకుండా క్లియర్‌ కట్‌ గా ఉంది. అనవసర గందరగోళం లేదు. ఊరిని దత్తత తీసుకోవడం అన్న పాయింటు అటు పల్లె టూళ్ల జనాలకు, ఇటు ఎన్నారై లకు బాగా కనెక్టయ్యింది.

=మహేష్‌ - శ్రుతిహాసన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. లవ్‌ స్టోరీ అందరికీ నచ్చింది.

=మరీ ఎక్కువ కమెడియన్ల వ్యంగ్య కామెడీలు లేకుండా కథని నడిపించడంలో కొరటాల దర్శకప్రతిభ ఆకట్టుకుంది.

= మది సినిమాటోగ్రఫీ పెద్ద అస్సెట్‌. పాటలు, యాక్షన్‌ పార్ట్‌ లో మరింత ఎఫెక్టివ్‌ గా విజువల్స్‌  చూపించింది కెమెరానే.

= దేవీశ్రీ ప్రసాద్‌ ఆర్‌.ఆర్‌, సంగీతం ప్రధాన బలం. సినిమాని మరో లెవల్‌ కి తీసుకెళ్లాయనడంలో సందేహమే లేదు.

=మహేష్‌-జగపతిబాబు మధ్య సన్నివేశాలు సక్సెస్‌. తండ్రి పాత్రలో జగపతిబాబు యాప్ట్‌ అయ్యాడు. అతడి నటన అసమానం.

=స్క్రీన్‌ ప్లే లో అనవసర గందరగోళం లేదు. టైట్‌ స్క్రీన్‌ ప్లే ఆకట్టుకుంది.

=రాజేంద్రప్రసాద్‌, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌.. పాత్రలు తెరపై సహజసిద్ధంగా కనిపించాయి. ఓవరాక్షన్‌ అస్సలు లేదు.

=ప్రొడక్షన్‌ విలువలు సూపర్భ్‌. నిర్మాతల పెట్టుబడి గ్రాండియర్‌ గా కనిపించింది. ఎక్కడ అనవసరం అనేది కాదు, ఎక్కడ అవసరం అనేది తెలుసుకొని ఖర్చుపెట్టినట్టున్నారు.
Tags:    

Similar News