డైరెక్టర్ గా మారిన తాగుబోతు రమేష్

Update: 2016-01-17 13:30 GMT

టాలీవుడ్ లో ఓ తరహా పాత్రలో ఓ నటుడు క్లిక్ అయితే.. ఇక అన్నీ అవే టైప్ కేరక్టర్స్ వస్తాయి. వాళ్ల ట్యాలెంట్ ఎన్ని రకాలుగా ఉన్నా.. అవే రోల్స్ చేసి వాళ్లకు మొనాటనీ వచ్చేస్తుంటుంది. తాగుబోతు రమేష్ గా అందరికీ తెలిసిన రమేష్.. అన్ని సినిమాల్లోనూ అవే కేరక్టర్స్ చేస్తున్నాడు. కానీ ఇతగాడిలో మరో ట్యాలెంట్ కూడా ఉంది.

లండన్ లో నాన్నకు ప్రేమతో చిత్రం కోసం షూటింగ్ కి వెళ్లినపుడు తన ఖాళీ టైం ను చక్కగా యూజ్ చేసేసుకున్నాడు రమేష్. రెండు నెలల పాటు అక్కడే ఉన్న రమేష్.. తన తోటి నటులతో ఓ షార్ట్ ఫిలిం తీసేశాడు. తనే స్క్రిప్ట్ రాసి, డైరెక్షన్ చేసి 'ఐ నో' అంటూ షార్ట్ ఫిలిం చేశాడు. అది కూడా కేవలం రెండంటే రోజుల్లో తీసేయడం విశేషం.

నవీన్, అమిత్, ఫారిన్ నటి లిజాలతో 8 నిమిషాల నిడివి ఉండే.. ఫిలిం తీశాడు తాగుబోతు రమేష్. ఓ ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ నడిపించేశాడు. అన్నిటి కంటే ముఖ్యంగా కేరక్టర్స్ డిజైనింగ్, వీటికి తోడు రిచ్ లొకేషన్స్ కావడంతో.. ఐనో చాలా బాగా  వచ్చిందని చెప్పాలి. లిజా ఓన్ డబ్బింగ్ కూడా ప్లస్ పాయింట్ అనాల్సిందే. అయితే.. ఎన్టీఆర్ కు, నాన్నకు ప్రేమతో నిర్మాతలు బీవీఎస్ ఎన్ ప్రసాద్ - రిలయన్స్ శ్రీధర్ - సుధీర్ లకు స్పెషల్ థ్యాంక్స్ ఇచ్చేసి, తనకు ఇంతటి అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు కూడా ప్రకటించేశాడు. ఏమైనా తాగుబోతు రమేష్ చేసిన ఈ డిఫరెంట్ ఎటెంప్ట్ కి చక్కని అప్లాజ్ వస్తోంది
Tags:    

Similar News