సూపర్‌ స్టార్‌ అభిమానుల పోరాటం ఫలించింది

Update: 2020-11-13 02:57 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ఈ ఏడాది సమ్మర్‌ లో 'మాస్టర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి వచ్చింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్వకత్వంలో రూపొందిన 'మాస్టర్‌' తో విజయ్‌ మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్నంతగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పటి నుండి కూడా  టీజర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. సినిమా ఎలాగూ లేట్‌ అవుతుంది కదా టీజర్‌ ఇవ్వండి అంటూ అభిమానులు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఇక దీపావళికి ఖచ్చితంగా మాస్టర్‌ టీజర్‌ ఇవ్వాల్సిందే అంటూ గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో తీవ్రంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

వారి ఒత్తిడి ఫలితమో లేదంటే ముందుగానే దీపావళికి టీజర్‌ ఇవ్వాలనుకున్నారో కాని మాస్టర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేశారు. మాస్టర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు వెయిట్‌ చేస్తున్న నేపథ్యంలో టీజర్‌ ను ఈనెల 14న దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ విషయాన్ని విజయ్‌ మరియు విజయ్‌ సేతుపతి ఉన్న పోస్టర్‌ ను విడుదల చేసి మరీ తెలియజేశారు.

రేపు సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్‌ ద్వారా విడుదల కాబోతున్న ఈ టీజర్ కు విజయ్‌ ఫ్యాన్స్‌ సరికొత్త రికార్డును కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధిక వ్యూస్‌ ను 24 గంటల్లో రాబట్టడంతో పాటు మిలియన్‌ లైక్స్‌ ను అతి తక్కువ సమయంలో నే వచ్చేలా చేయాలని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ కి జోడీగా మాళవిక మోహన్‌ మరియు ఆండ్రియాలు నటించారు. అనిరుథ్‌ సంగీతాన్ని అందించాడు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయితే సినిమాను జనవరిలో విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Tags:    

Similar News