`అఖండ` ద‌రువుకు `రాధేశ్యామ్` ఆఫ‌ర్

Update: 2021-12-13 23:30 GMT
ఇది విన‌డానికి వింత‌గా ఉన్నా కానీ నిజం. ఇటీవ‌ల విడుద‌లైన అఖండ రీరికార్డింగ్ గురించి జ‌నం ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. అఖండ‌కు రీరికార్డింగ్ కూడా ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. అమెరికాలో అయితే థియేట‌ర్ల‌లో సౌండ్ వాల్యూమ్ ని త‌గ్గించేంత‌గా డిమాండ్ నెల‌కొందంటే థ‌మ‌న్ ఏ రేంజులో సౌండింగ్ పై శ్ర‌ద్ధ పెట్టారో అర్థం  చేసుకోవ‌చ్చు.

ఆస‌క్తిక‌రంగా ఇప్పుడు థ‌మ‌న్ తో రాధేశ్యామ్ కి రీరికార్డింగ్ చేయించేందుకు యువి సంస్థ ప్లాన్ చేస్తోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. నిజానికి పాట‌ల‌కు ఒక్కో భాష‌ను బ‌ట్టి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను ఫిక్స్ చేయ‌గా.. నేప‌థ్య సంగీతం విష‌యంలో థ‌మ‌న్ ది బెస్ట్ అని భావిస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే థ‌మ‌న్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే.

ఇక యువీ వాళ్ల ఎంపిక‌లు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇంత‌కుముందు సాహో కోసం శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ వంటి దిగ్గ‌జాల్ని ఎంచుకుని ఆ త‌ర్వాత వారితో స‌రిప‌డ‌క వేరే సంగీత ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేసుకున్నారు. జిబ్రాన్ కి రీరికార్డింగ్ కోసం అవ‌కాశం క‌ల్పించారు. తర్వాత ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడికి అప్ప‌జెప్పారు. ఇప్పుడు రాధేశ్యామ్ కి వేర్వేరు సంగీత ద‌ర్శ‌కుల‌ను రంగంలోకి దించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ ప‌ని చేస్తుండ‌గా.. హిందీ వెర్షన్ కు మిథూన్- అర్మాన్ మాలిక్- అర్జీత్ సింగ్- మనన్ భరద్వాజ్ లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. వీరంతా అద్భుత‌మైన ట్యూన్స్ ని అందిస్తున్నారు. వీళ్లంద‌రికీ ధీటుగా ఇప్పుడు థ‌మ‌న్ ని బ‌రిలో దించి ఆర్.ఆర్ వ‌ర్క్ చేయించాల‌న్న స్ట్రాట‌జీని చూస్తుంటే యువీ వాళ్లు చాలా తెలివైన ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రిస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

డెడె లైన్ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ మ‌ల్టిపుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో ప‌నిని వేగంగా పూర్తి చేయాల‌ని స‌ద‌రు బ్యాన‌ర్ భావిస్తూ ఉండొచ్చు. అయితే ప్రేమ‌క‌థా చిత్రాల‌కు ఏ.ఆర్.రెహ‌మాన్ లేదా హ్యారిస్ జైరాజ్ లాంటి వాళ్ల రీరికార్డింగ్ అయితే మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోంది. కానీ థ‌మ‌న్ వాళ్ల‌ను మించి నిరూపించి చూపిస్తార‌ని కూడా పాజిటివిటీ ఉంది.
Tags:    

Similar News