బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్లలో స్పీకర్ లు బద్దలు అయ్యాయి. ఒక థియేటర్ వారు పూర్తి సౌండ్ ను పెట్టలేమంటూ ప్రెస్ నోట్ ను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో థమన్ కు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు తాజాగా థమన్ ను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమా రీ రికార్డింగ్ కోసం థమన్ ను వారు సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.
రాధే శ్యామ్ సినిమాకు ఇప్పటికే పలువురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. సౌత్ కోసం నార్త్ కోసం వేరు వేరు వర్షన్ ల సంగీతంను రెడీ చేయించిన మేకర్స్ తెలుగు వర్షన్ కు థమన్ చేత రీ రికార్డింగ్ చేయించి సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. థమన్ మాస్ బీట్స్ తో రాధే శ్యామ్ కు కొత్త ఊపు తీసుకు వస్తాడని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయి పెరుగుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఈమద్య కాలంలో తెలుగు మరియు తమిళంలో థమన్ పాటలు.. బీజీ తో ఆయన పేరు మారు మ్రోగుతోంది. అందుకు రాధే శ్యామ్ కు ఆయన ప్లస్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ప్రభాస్ సినిమా కు వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో థమన్ చెప్పుకొచ్చాడు. ఇంతలోనే రాధే శ్యామ్ కు వాయించే ఛాన్స్ వచ్చింది.
ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ కోసం అభిమానులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. కరోనా వల్ల మరింత ఆలస్యం అయ్యింది. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కు దర్శకుడు రాధాకృష్ణ చాలా సమయం తీసుకున్నాడు. సాహో సినిమా సమయంలో కూడా చాలా కాలం షూట్ చేస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. కాని సినిమా విడుదల తర్వాత ఆహా అంటూ అంతా కూడా నోరు వెళ్లబెట్టారు. ఇప్పుడు అదే తరహాలో రాధేశ్యామ్ కు కూడా టాక్ వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. హిందీ వర్షన్ కోసం ప్రత్యేక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు వర్క్ చేశారు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా భారీగా వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.