ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడి నుంచే ట్యూన్లు ఎత్తుకొచ్చేయడం సాధారణమైన విషయం. మెజారిటీ మ్యూజిక్ డైరెక్టర్స్ సైలెంటుగా ట్యూన్లు కాపీ కొట్టిన వాళ్లే. ఐతే ఒకప్పుడైతే ఈ కాపీల గురించి పెద్దగా తెలిసేది కానీ.. ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోయి.. ఒక కాపీ పాట బయటికి రాగానే దాని ఒరిజినల్ ఏంటో బయటపెట్టేస్తున్నారు నెటిజన్లు. ఈతరం తెలుగు సంగీత దర్శకుల్లో కాపీ ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొన్న వాళ్లలో తమన్ ఒకడు. గూగుల్లోకి.. యూట్యూబ్ లోకి వెళ్లి తమన్ కాపీ పాటలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఐతే తమన్ మాత్రం తాను ఎప్పుడూ ఏ పాటనూ కాపీ కొట్టలేదని చెబుతుండటం విశేషం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీపై కాపీ క్యాట్ అనే ముద్ర ఉన్నందుకు బాధపడతారా అని తమన్ ను అడిగితే.. ‘‘నేను అలా చేస్తే కదా బాధపడాలి. నేను కాపీ కొట్టనపుడు ఎందుకు బాధపడాలి! దర్శక నిర్మాతలకు కావలసిన ఔట్‌పుట్ ఇవ్వడం నా బాధ్యత. వాళ్లకు కోరింది.. నచ్చింది ఇస్తానంతే. కాపీ కొడితే తెలియనంత వెర్రి దర్శకనిర్మాతలు మన దర్శక నిర్మాతలెవరూ ఇక్కడ లేరు. ఒక ట్యూన్ ఓకే కావాలంటే ఒకరి నిర్ణయంతో సరికాదు. దర్శకుడు.. నిర్మాత.. హీరో.. వాళ్ల ఫ్యామిలీలు ఇలా చాలామంది వెనకుంటారు. వాళ్లంతా ఓకే అన్నాకే అది రికార్డింగ్ కు వెళ్తుంది. ఈ ఇంటర్‌నెట్ యుగంలో కాపీ కొట్టడం అంత ఈజీ కాదు’’ అని చెప్పాడు. కానీ ‘రేసుగుర్రం’ లోని స్వీటీ పాట..‘బిజినెస్ మేన్’ లోని చావ్ పిల్లా.. ఇంకా తమన్ చేసిన చాలా పాటలకు సంబంధించి కాపీ ట్యూన్స్ అంటూ సాక్ష్యాధారాలు చూపించే వాళ్లకు తమన్ ఏమని బదులిస్తాడో?