అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల అనంతరం మరో సక్సెస్ అందుకోవడానికి థాంక్యూ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో కలెక్షన్స్ మాత్రం సాధించలేకపోయాయి.
ఇక ఇప్పుడు నాగచైతన్య థాంక్యూ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. రీసెంట్గా చిత్ర యూనిట్ సభ్యులు ఫైనల్ కట్ కూడా రెడీ చేసేసారు. అయితే ఈ రోజుల్లో సినిమాని నిడివి అనేది కూడా చాలా ముఖ్యంగా మారింది. దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంతకుముందు రెండు గంటల 30 నిమిషాలతో థాంక్యూ సినిమాను రెడీ చేశారట.
కానీ ఆ తర్వాత దిల్ రాజు ఆలోచనల మేరకు మళ్ళీ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చర్చించుకుని ఆడియన్స్ ను ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఉండాలి అని మరి కొంత నిడివిని తగ్గించాలి అని ఇటీవల ఒక ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ చేశారు. సినిమా రెండు గంటల 9 నిమిషాలు మాత్రమే ఉండే విధంగా ఎడిట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫైనల్ కాపీ చాలా అద్భుతంగా వచ్చినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇదివరకే నాగచైతన్యతో మనం సినిమా చేశాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరి కలయిక లో వస్తున్న సినిమా కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల మంచి నమ్మకం అయితే ఉంది. థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.