ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న హీరోయిన్ రష్మికా మందన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. లక్షల కుర్రాళ్ళ క్రష్ ఈ కన్నడ హీరోయిన్. తాజాగా ఓ తమిళ హీరో కూడా తనకు రష్మిక అంటే క్రష్ అని బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తమిళ యువ హీరో హరీష్ కల్యాణ్ హీరోగా బాలీవుడ్ చిత్రం విక్కీ డోనార్‌ను తమిళంలో 'ధారాళ ప్రభు' పేరుతో రీమేక్ చేశారు. మార్చి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ చాలా హ్యాపీగా జవాబిచ్చాడు.
తనకు ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన వ్యక్తుల గురించి చెప్పిన హరీష్.. ఈ సందర్భంగా ఓ వ్యక్తి'‘నీకు ఏ హీరోయిన్ అంటే క్రష్' అని అడిగాడు. దీనికి ఆ హీరో టక్కున సమాధానమిస్తూ.. రష్మికా మందన అని చెప్పి ట్విట్టర్ లో రష్మికను టాగ్ చేసాడు. ఈ సమాధానం చూసిన పలువురు రష్మికా అభిమానులు ఆశ్చర్యపోయారు. త్వరలో రష్మికాతో ఏమైనా సినిమా చేయబోతున్నారా అని హరీష్‌ను ప్రశ్నించారు. అయితే అందుకు ఆ హీరో ఎలాంటి సమాధానం చెప్పలేదు. అలాగే ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం హరీష్ తెలుగు చిత్రం పెళ్లి చూపులు తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.