ఒకే రకమైన స్టొరీ లైన్.. లేదా థీమ్ ఉండే కథలు మన టాలీవుడ్ లో అప్పుడప్పుడు వస్తుంటాయి. ఒక్కోసారి పోలికలు మరీ ఎక్కువైనప్పుడు షూటింగ్ దశలోనే సినిమా స్టొరీని కూడా మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. త్వరలో రిలీజ్ కానున్న రెండు పెద్ద సినిమాల్లో ఇలానే ఒక పోలిక ఉందని ఇన్సైడ్ టాక్. ఆ రెండు సినిమాలే 'వెంకీమామ'.. 'అల వైకుంఠపురములో'.
బాబీ దర్శకత్వంలో వెంకటేష్.. నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వెంకీమామ'. నిజజీవితంలో వెంకీకి మేనల్లుడు నాగచైతన్య.. ఈ సినిమాలో అవే పాత్రలను పోషించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా బేసిక్ స్టొరీలైన్ జాతకదోషంపైనే ఉంటుందట. అందువల్లే చైతు చిన్నవయసునుంచి మేనమామ దగ్గరే పెరుగుతాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో కూడా జాతకదోషం అనేది కీ రోల్ ప్లే చేస్తుందట. అందువల్లే బన్నీ ప్లేస్ లో సుశాంత్ ఉంటాడని.. బన్నీ మాత్రం డ్రైవర్ దగ్గర పెరుగుతాడని అంటున్నారు.
జాతకాలు.. ఆస్ట్రాలజీని కొందరు నమ్ముతారు.. కొందరు నమ్మరు. అయితే ఆ లాజిక్కులు పక్కన పెట్టి చూస్తే సినిమా కథలకు ఇది ఇంట్రెస్టింగ్ ముడిసరుకు. అందుకే రెండు పెద్ద సినిమాల్లో జాతకదోషాలు కీలకపాత్ర పోషించడం అందరినీ ఆకర్షిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే కానీ గ్రహాలూ... గ్రహబలాలు ఎలా ఉన్నాయి.. అవి ఏం చేసి హీరోలను ఇబ్బందులు పెట్టాయి.. హీరోలు వాటికి ఎలా మస్కా కొట్టారు.. అనేది తెలీదు.