ఆ స్టార్ హీరో.. నన్ను 'అన్నగారు' అంటారు: ఫిష్ వెంకట్

Update: 2021-04-28 02:30 GMT
స్టార్ హీరోలు అంటే వారు ఎల్లప్పుడూ కెమెరా ముందు కనబడుతూ స్టార్డం మాత్రమే ప్రదర్శిస్తారు లేదా ఎల్లప్పుడూ స్టార్స్ తో, స్టార్ డైరెక్టర్స్ ఇలా అందరూ వాళ్ళ స్థాయికి తగ్గవాళ్లనే పలకరిస్తారు.. పట్టించుకుంటారు అని వింటుంటాం. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అందరు స్టార్స్ అలా ఉండరు. కొందరు స్టార్ హీరోలు కింది స్థాయి నటులను కూడా పట్టించుకుంటారు. జూనియర్ ఆర్టిస్టులతో సహా అందరికి కేర్ తీసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కమెడియన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్. తాజాగా ఫిష్ వెంకట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కు శ్రీధర్ రెడ్డి అనే దర్శకుడు క్లోస్. ఆయన నాకు పరిచయం. ఆ విధంగా నాకు పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో పనిచేసానని చెప్పాడు వెంకట్. పవన్ కళ్యాణ్ ఎంత స్టార్ అయినప్పటికీ అందరిని గౌరవంగానే సంభోదిస్తారు. నన్ను కూడా ఆయన ఎంతో మర్యాదగా 'అన్నగారు' అని పిలిచేవారు. ఎప్పటికప్పుడు నా యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అలా ఉన్నాడు.. ఎందుకు జనాలు అంతలా ప్రేమిస్తారు..? అంటే 'అది ఆయన వినయం. ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరికీ సహాయం కావాలన్నా వస్తారు' అని చెప్పుకొచ్చాడు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం
Tags:    

Similar News