కన్నడ రాక్ స్టార్ యశ్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోల్లో యశ్ ఒకరు. కర్ణాటకలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఈయన.. నటనపై ఉన్న మక్కువతో 15 సంవత్సరాల వయస్సులోనే బెంగళూరు పారిపోయి డ్రామాలు వేసి వచ్చిన డబ్బుతో జీవనం సాగించాడు.
ఆ తర్వాత మెల్ల మెల్లగా స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్ చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తుండగా.. `మొగ్గిన మనసులు` అనే మూవీలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. అదే యశ్ తొలి చిత్రం. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారానే యశ్ భార్య రాధికా పండిట్ కూడా హీరోయిన్‌గా పరిచయం అయింది. కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో.. యశ్ కు మరిన్ని ఆఫర్లు అందాయి.
దాంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కో సినిమా చేసుకుంటూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అలాగే తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రాధికా పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యశ్.. `కేజీఎఫ్ చాప్టర్ 1` సినిమాతో ఆలిండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు చాప్టర్ 1కు కొనసాగింపుగా `కేజీఎఫ్ చాప్టర్ 2`తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నేడు అట్టహాసంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో యశ్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెన్నో షేర్ చేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, అవమానాలు అన్నిటినీ పంచుకున్నాడు. అలాగే తాను పేరు మార్చుకోవడానికి ఆసలు కారణం ఏంటో కూడా రివిల్ చేశాడు.
వాస్తవానికి యశ్ అసలు పేరు.. నవీన్ కుమార్ గౌడ. కానీ, సినిమాల్లోకి వచ్చాక యశ్ గా మార్చుకున్నాడు. తన నక్షత్రం ప్రకారం `య` అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలని జ్యోతిష్యులు సూచించారట. అందువల్లనే పేరు మార్చుకున్నా అంటూ యశ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా, సెలబ్రెటీలకు పేరు మార్చుకోవడం ఏమీ కొత్త కాదు. సినిమాల్లోకి వచ్చాక షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండటం కోసం ఎందరో తారలు తమ పేరును మార్చుకున్నారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్న సెలబ్రెటీలు ఉన్నారు