మాయాదారి కరోనా మూవీ ఇండస్ట్రీని ఎంతలా దెబ్బేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మిగిలిన వ్యాపారాలకు సినిమా వ్యాపారానికి తేడా చాలానే. ఒక సినిమా విడుదలకు లెక్కలెన్నో ఉంటాయి. ఏ చిన్న తేడా కొట్టినా కోట్లాది రూపాయిలు నీళ్లలో కలిసినట్లే. అందుకే.. నాలుగు రోజులు ఆలస్యమైనా.. అన్ని కాంబినేషన్లు కుదిరిన తర్వాతే సినిమాల్ని విడుదల చేస్తుంటారు. కరోనా కేసులు పెరిగిపోయి.. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సినిమా థియేటర్లను మూసేయటం తెలిసిందే.
అలా మూసిన థియేటర్లను లాక్ డౌన్ తీసేసిన వెంటనే ఓపెన్ కాలేదు. మిగిలిన వ్యాపారలన్నీ లాక్ డౌన్ ఎత్తేసిన ఒకట్రెండు రోజుల్లోనే తెరవగా.. థియేటర్లు మాత్రం ఈరోజుకు తెరిచింది లేదు. తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసుకోమన్నా.. ఏపీతో ఉన్న లింకు కారణంగా.. సినిమా హాళ్లు ఓపెన్ కాలేదు. రెండు రోజుల క్రితమే ఏపీలో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
అలా చెప్పినంతనే థియేటర్లను ఓపెన్ చేసే అవకాశం లేదు. కారణం.. కిరాణా షాపుకెళ్లి సామాన్లు తెచ్చేసుకొని పొద్దుపొద్దున్నే తెరిచేసే హోటల్ వ్యాపారం ఎంతమాత్రం కాకపోవటం.. ఇప్పటికి బెంగళూరు.. చెన్నైలో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న క్లారిటీ లేకపోవటంతో థియేటర్లను ఎప్పటికి తెరుస్తారో ఇప్పటివరకు క్లారిటీ లేని పరిస్థితి. విడుదలకు సిద్ధంగా బోలెడన్ని సినిమాలు ఉండటం.. ఒకసారి ఓపెన్ అయితే చాలు.. వరుస పెట్టి బరిలోకి దూకటానికి రెఢీగా ఉన్నారు.
ఇలాంటివేళ.. తాజాగా విడుదలైన ఒక మూవీ పోస్టర్.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. ఆ మాటకు వస్తే.. సినిమా హాళ్ల ప్రారంభం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలకాయలు లాంటి వారి నుంచి అధికారిక ప్రకటన రాక ముందే.. ఈ మూవీ పోస్టర్ లో పేర్కొన్న డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరసు’ మూవీ విడుదలకు రెఢీ అయింది. తాజాగా ఆ మూవీ టీం తమ సినిమాను థియేటర్లలో ఓపెన్ చేసే డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల (జులై) 30న తమ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తిమ్మరసు చిత్రనిర్మాత.. దర్శకులు పేర్కొన్నారు. దీంతో.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మొదటి మూవీగా సత్యదేవ్ నిలుస్తుంది. ఒకవేళ ప్రేక్షకులు పాజిటివ్ గా రియాక్ట్ అయి.. సినిమాహాళ్లకు రావటం షురూ చేస్తే మాత్రం.. ఆగస్టులో బోలెడన్ని సినిమాలు విడుదలకు సిద్ధమైనట్లేనని చెబుతున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన తిమ్మరసు మూవీ.. తాజాగా విడుదల చేసిన మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న విషయంపై క్లారిటీ ఇచ్చేసిందని చెప్పాలి.