ముదిమి వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన భారత సినీ సూపర్ స్టార్లలో ఒకరు దిలీప్ కుమార్. మెథడ్ యాక్టర్ గా పేరున్న ఆయన.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి ముందు ఏం చేశారన్న విషయం ఇప్పటి తరానికి పెద్ద తెలీదు. ఆ మాటకు వస్తే.. ఆయన సినిమాల్లోకి ఎంట్రీనే సినిమాటిక్ సీన్ తో మొదలైందని చెప్పాలి. నిజానికి ఈ రోజుకు ఏదైనా సినిమాకు వాడేందుకు వీలున్న సీన్ గా దీన్ని చెప్పాలి. ఇంతకూ ఆయన సినిమా ఎంట్రీ ఎలా మొదలైందంటే..
ప్రఖ్యాత నటి కమ్ బాంబే టాకీస్ యజమాని దేవికా రాణి ఫుణె రోడ్డు మీద వెళుతున్నారు. ఆమెకు రోడ్డు మీద పండ్లు అమ్మే ఒక యువకుడ్నిచూశారు. అతడ్ని చూసినంతనే హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. ఆలస్యం చేయకుండా తాను తీసే సినిమాలో హీరోగా ఎంపిక చేశారు. ఆ యువకుడు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. అలియాస్ దిలీప్ కుమార్. ఇంతకీ అతడి పేరు మార్చటానికి కారణం.. అప్పట్లో అందరికి సులువుగా ఉండే పేరును పెడితే బాగుంటుందని సినిమా టీం అనుకుంది. అప్పట్లో సూపర్ స్టార్ గా ఉన్న అశోక్ కుమార్ కాబట్టి.. కొత్తగా తాము పరిచయం చేస్తున్న నటుడికి దిలీప్ కుమార్ అని పేరు పెడితే బాగుంటుందని భావించారు. అందుకు యూసఫ్ ఖాన్ ఓకే చెప్పటంతో.. సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు అలా సుస్థిరమైంది. దిగ్గజ నటుడిగా నిలిచిపోయారు.
దిలీప్ కుమార్ పుట్టింది ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లోని కిస్కాఖవానీ బజార్ లో. అతడి తండ్రి పండ్ల వ్యాపారి. మహారాష్ట్రలో వారికి భూములు ఉండటంతో వారి కుటుంబం ముంబయికి చేరుకుంది. ఫుణెలో పండ్ల దుకాణం నడుపుతున్న యూసఫ్ ఖాన్ ను చూసిన దేవికా రాణి పుణ్యమా అని అతడ్ని సినిమా నటుడ్ని చేయాలనుకున్నారు. ఇక.. యూసఫ్ అలియాస్ దిలీప్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా నటుడు అవుతాడని అస్సలు అనుకోలేదు.
దొరికిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవటమే కాదు.. భారతీయ సినిమా మీద ఏదైనా రీసెర్చ్ చేయాలంటే.. దిలీప్ కుమార్ సినీ జీవితాన్ని చూస్తే సరిపోతుందంటారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. అతడు నటించిన తొలి చిత్రం జ్వార్ భాటా.. 1944లో విడుదలైంది. ఆ మూవీ అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. సినీ విమర్శకులు అతని నటనను తీవ్రంగా విమర్శించారు. అదే అతడిలో పట్టుదలను పెంచటమే కాదు.. చివరకుమహా నటుడిగా నిలిచారు.
దిలీప్ కుమార్ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితం సైతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితం. పలువురు నటీమణులతో ప్రేమాయణం నడిచినప్పటికి అనుకోని కారణాలతో పెళ్లి వరకు వెళ్లలేకపోయాయి. ఆయనతో నటించిన నటీమణులలో కామినీ కౌశల్ తో ఆయన సన్నిహితంగా ఉండేవారు. కానీ.. ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు. తర్వాత మధుబాలతో లవ్ ఎపిసోడ్ అందరికి తెలిసిందే. అదీ.. ఫెయిల్ అయ్యింది. వైజయంతీమాలతోనే ఆయన ప్రేమాయణం సక్సెస్ కాలేదు. చివరకు తన కంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును తన 44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. కానీ.. వారికి పిల్లలు లేరు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన ఆయన ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. తన వ్యక్తిగత విషయాల్ని ఎవరితోనూ పంచుకునే వారు కాదు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు. 98 ఏళ్ల వయసులో ఆయన శాశ్విత నిద్రలోకి జారుకున్నారు. దీంతో.. భారతీయసినిమాకు సంబంధించి ఒక లెజెండరీ శకం ముగిసినట్లైంది.