జంగిల్ బుక్.. డిస్నీ వాళ్లు తీసిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు అంచనాలు మామూలుగానే ఉన్నాయి. అన్ని హాలీవుడ్ సినిమాల్లాగే ఇది కూడా అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. కొత్త చరిత్రలు నమోదయ్యాయి. ఇండియాలో ఏ హాలీవుడ్ సినిమా సృష్టించనన్ని రికార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 100 రోజులు కూడా పూర్తి చేసేసుకుంది.
'జంగిల్ చట్టాలను ఇరగదీసిన 100రోజులు' అంటూ జంగిల్ బుక్ మేకర్స్ ఓ అఫీషియల్ పోస్టర్ వేసుకున్నారంటే.. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్స్ అర్ధమవుతాయి. అంతే కాదు.. ఇప్పటికి రూ. .187.40 కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుందీ సినిమా. ఇంతకు ముందు ఇండిపెండెన్స్ డే - టైటానిక్ లాంటి హాలీవుడ్ సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి కానీ.. మరీ ఈ స్థాయిలో మాత్రం కాదు. ఇప్పటికీ ఇండియాలోని ప్రతీ మల్టీప్లెక్స్ లోనూ జంగిల్ బుక్ కి షోస్ పడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు 100 రోజుల తర్వాత కూడా మరో 25 స్క్రీన్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. జంగిల్ బుక్ రాసిన కొత్తచరిత్ర అర్ధమవుతుంది. ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చూపించిందీ సినిమా. జంగిల్ బుక్ కి రియల్లీ హ్యాట్సాఫ్ అనాల్సిందే కదూ.