చిరు, మహేష్, ప్రభాస్.. చిన్న సినిమాలకు 'పెద్ద' సపోర్ట్ సిస్ట‌మ్!

చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు రారనే విషయం మీద గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-11-14 14:30 GMT

చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు రారనే విషయం మీద గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల 'జితేందర్ రెడ్డి' ఈవెంట్ లో హీరో రాకేష్ వర్రే మాట్లాడుతూ.. చిన్న సినిమాల ఈవెంట్లకి సెలబ్రిటీలను తీసుకురావడం చాలా కష్టమైన విషయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిలిచినా రారంటూ ఆవేశంగా మాట్లాడారు. దీనికి కౌంటర్ గా దిల్ రాజు మాట్లాడుతూ.. సెలబ్రిటీలు ఎందుకు వస్తారు? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్లది. వాళ్ల టైం మీ టైంతో సెట్ అయితేనే వస్తారని అన్నారు. ఇప్పుడు ఇరువురి కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరి ఒపీనియన్స్ వాళ్లు చెబుతున్నారు.

నిజానికి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలంతా ముందే ఉంటారు. కాకపోతే కొందరు సినిమా రిలీజ్ కు ముందు సపోర్ట్ చేస్తే, మరికొందరు సినిమా సక్సెస్ అయ్యాక దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి తమవంతు మద్దతు తెలుపుతారు. మొన్నటికి మొన్న సీనియర్ హీరో చిరంజీవి 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చారు. సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా ఇది. ప్రేమతో అభిమానంతో పిలిస్తే తాను ఏ ఈవెంట్ కైనా వస్తానని చిరు ఈ సందర్భంగా అన్నారు.

మహేష్ బాబు సినిమా బాగుంటే చాలు, అది చిన్నదా పెద్దదా అని చూడకుండా వెంటనే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి ప్రశంసిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ప్రమోషనల్ కంటెంట్ ను లాంఛ్ చేస్తుంటారు. ప్రభాస్ సైతం చిన్న సినిమాల టీజర్లు ట్రెయిలర్లు రిలీజ్ చేస్తూ, తనవంతు సపోర్ట్ ఇస్తుంటారు. కంటెంట్ నచ్చితే సినిమా గురించి పోస్టులు కూడా పెడతారు. డార్లింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను తన సినిమాల కంటే ఇతర చిత్రాల ప్రచారానికే ఎక్కువగా వాడుతుంటారు.

అల్లు అర్జున్ ఏదైనా సినిమా నచ్చితే ఇంటికి పిలిచి మరీ అభినందిస్తారు.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ కు, సక్సెస్ మీట్స్ కు గెస్టుగా వెళ్తుంటారు. అక్కినేని నాగచైతన్య కూడా ఇలాంటి వాటికి ఎప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల కిరణ్ అన్నవరం నటించిన 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చైతూ ముఖ్య అతిథిగా హాజరై, తన మద్దతు తెలుపుతారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే హీరోల లిస్టులో నాని కూడా ఉంటారు. సుధీర్ బాబు, సందీప్ కిషన్ లాంటి హీరోలు సైతం ఇతరుల సినిమాలకు మద్దతుగా నిలుస్తుంటారు. ఇక టాలీవుడ్ లో చాలా చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా రానా దగ్గుబాటి ఉన్నారు.

ఎవ‌రైనా సరే మంచి కంటెంట్ తో వస్తే రానా మ‌ద్ద‌తు తప్పకుండా ఉంటుంద‌నే అభిప్రాయం ఇండ‌స్ట్రీలో ఉంది. సినిమాలను రిలీజ్ చేసుకోడానికి ఇబ్బంది పడేవారికి తనవంతు హెల్ప్ చేస్తూ, తెర వెనుక ఉండి అంతా న‌డిపిస్తారు. అలానే ప్ర‌మోష‌న్ల‌కు వ‌చ్చి సాయం అందిస్తుంటారు. రీసెంట్ గా 'దేవ‌కీ నంద‌న వాసుదేవ' ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. త‌మ‌కు స‌రైన స‌పోర్ట్ సిస్ట‌మ్ లేద‌ని కొందరు బాధ ప‌డ‌డం చూశాను. అలాంటి వాళ్లంద‌రికీ రానా నంబ‌ర్ ఇస్తా. ఒక్క ఫోన్ చేయండి చాలు. అత‌ను వ‌చ్చేస్తాడు. మాలాంటి వాళ్లంద‌రినీ ప్ర‌మోష‌న్లకు తీసుకొస్తాడు అని అన్నారు.

ఇలా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు సాయం చేసే హీరోలు చాలామందే ఉన్నారు. కాకపోతే వాళ్ళని చేరుకోవడం ఎంతమంది స్మాల్ ఫిలిం మేకర్స్ కు సాధ్యపడుతుందనేదే ఇక్కడ ప్రశ్న. సెలబ్రిటీలలో చాలా వరకు తమకు పరిచయం ఉన్న నటీనటులు లేదా దర్శకనిర్మాతల సినిమాలకు మాత్రమే సపోర్టుగా నిలుస్తున్నారు. పెద్ద హీరోలను ఫంక్షన్స్ కు తీసుకురావడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కొన్నిసార్లు వాళ్ళకి రావాలని ఉన్నా, టైమ్ కుదరక రాలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరినీ నిందించలేం. చిన్న చిత్రాలకు ఎందుకు సపోర్టు చేయలేదని క్యశ్చన్ చెయ్యలేం. సపోర్ట్ చెయ్యాలని డిమాండ్ కూడా చెయ్యలేం.

కాకపోతే సెలబ్రిటీల మద్దతు అనేది చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అవుతుందనేది వాస్తవం. ఎంత మంచి మూవీ చేసినా.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి, మార్కెటింగ్ చేసుకోడానికి 'పెద్ద' సపోర్ట్ అవసరం అవుతుంది. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ సినిమాకి మీడియా ప్రచారం లభిస్తుంది.. దాంతో జనాలు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా నచ్చితే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. ఈరోజుల్లో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్ల వరకూ తీసుకురావడానికి సెలబ్రిటీల సపోర్ట్ అవసరమే.

చిన్న సినిమా చచ్చిపోతోంది అనే మాట ఇండస్ట్రీలో తరచుగా మనం వింటూ ఉంటాం. పెద్ద సినిమాలకే థియేటర్లు ఇస్తారని, చిన్న చిత్రాలను పట్టించుకోరనే కామెంట్లు వినిపిస్తుంటాయి. కానీ ఒక ఏడాదికి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా అన్ని రోజులూ థియేటర్లకు ఫీడింగ్ ఇచ్చేది చిన్న సినిమాలే అనే సంగతి మర్చిపోకూడదు. కాబట్టి 'చిన్న' సినిమాలకు 'పెద్ద' సాయం ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది.. పది మందికి ఉపాధి దొరుకుతుంది. ''పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది ఇండస్ట్రీ కాదు.. ఇక్కడ అన్ని సినిమాలూ ఆడాలి''.. చిరంజీవి లాంటి మెగా స్టారే స్వయంగా ఈ మాటలు అన్నారు.

సో పెద్ద సినిమాలు తీస్తే పెద్ద స్టార్లు అయిపోరు.. చిన్న సినిమాలకు సపోర్టు చేసి, పెద్ద మనసు ఉందని నిరూపించుకుంటేనే పెద్ద స్టార్లు అవుతారని సినీ అభిమానులు భావిస్తున్నారు. మన స్టార్ హీరోలంతా చిన్న చిత్రాలకు, అప్ కమింగ్ హీరోలకు తమవంతు మద్దతు తెలిపితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News