బాలీవుడ్ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హాలీవుడ్ సినిమా 'పారెస్ట్ గంప్' ఆధారంగా తెరకెక్కించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ కు తొలి సారి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది.
అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ 'బాయ్ కాట్ ' ట్రెండ్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందు నుంచి ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైన విషయం తెలిసిందే. దీనిపై హీరోయిన్ కరీనా కపూర్ ఘాటుగా స్పందించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాతో మాట్లాడుతూ కరీనా కపూర్ విచారం వ్యక్తం చేసింది. సినిమా వసూళ్లు పడిపోవడం పల్ల ఆవేదన వ్యక్తం చేసింది. 'లాల్ సింగ్ చడ్డా' మంచి సినిమా అని ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బాయ్ కాట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొంది.
అంతే కాకుండా ఈ మూవీ కోసం దాదాపు 250 మంది ఎంతో శ్రమించారని వాపోయింది. అయితే ఈ వ్యాఖ్యలపై 'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాస్త ఘాటుగా స్పందించాడు. బాలీవుడ్ డాన్ లుగా నటులు వ్యవహరించి హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన సంచలన ట్విట్ లు చేశారు. చిన్న సినిమాలు.. మంచి కంటెంట్ వున్న మూవీస్ ను బాలీవుడ్ డాన్ లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదన్నాడు.
అలా బాలీవుడ్ డాన్ లు గా పిలవబడే కొందురు నటుల కారణంగా ప్రతిభ వున్న నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశనమయ్యాయి కదా? ఆ సినిమాలకు కూడా పని చేసింది 250 మంది పేద ప్రజలే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతే కాకుండా మరో ట్వీట్ లో బాలీవుడ్ డాన్ ల అహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలినప్పుడు వారిని వేడి కాఫీలో ముంచేస్తారు' అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ లు ప్రస్తుతం నెట్టింట వైరలల్ గా మారాయి.
మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా? .. కౌంటర్ ఇచ్చే సాహసం చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే 'లాల్ సింగ్ చడ్డా' మూవీకి సపోర్ట్ గా నిలిచిన వారిని కూడా బాయ్ కాట్ చేయాలంటే నెట్టింట ట్రెంట్ అవుతోంది.
ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ కూడా టార్గెట్ కావడం గమనార్హం. అంతే కాకుండా 'రక్షాబంధన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్ కుమార్ ని కూడా కొంత మంది టార్గెట్ చేస్తూ అమీర్ కు సపోర్ట్ గా నిలిస్తే ఇంతే అంటూ అక్షయ్ సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తుండటం విశేషం.