ది కశ్మీర్‌ ఫైల్స్... ఆర్ఆర్ఆర్ కి ఊరట కలిగించే విషయం

Update: 2022-03-23 00:30 GMT
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న సినిమా పేరు ది కశ్మీర్‌ ఫైల్స్. విడుదల అయిన మొదటి రోజు కేవలం మూడు కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా రెండవ రోజు నుండి అనూహ్యంగా భారీ వసూళ్లను రాబట్టడం మొదలు పెట్టింది. అప్పటి నుండి వరుసగా పది రోజుల పాటు కంటిన్యూస్ గా వసూళ్ల జోరు పెంచుకుంటూనే పోయింది. ఎట్టకేలకు ది కశ్మీర్ ఫైల్స్ సినిమా జోరు తగ్గిందని ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విడుదల అయిన పది రోజుల తర్వాత సినిమా జోరు తగ్గిందని.. సినిమా వసూళ్ల విషయంలో కాస్త డౌన్‌ ఫాల్‌ నిన్న కనిపించిందని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మళ్లీ వీకెండ్‌ లో వసూళ్లు భారీగా ఉండవచ్చు. కాని మొత్తంగా మాత్రం ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా ఓ రేంజ్ లో ఎగసింది. ఇప్పుడు మెల్ల మెల్లగా డౌన్ ఫాల్‌ అవుతున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్‌ యూనిట్‌ సభ్యులు కాస్త రిలాక్స్ అవుతున్నారు.

రాధేశ్యామ్‌ సినిమాను కనిపించకుండా చేసిన ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా మూడవ వారంలో కూడా జోరు కొనసాగిస్తే తప్పకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఈ సినిమా ను చూడాల్సిన వారు.. చూడాలనుకున్న వారు మ్యాగ్జిమం చూసేశారు. కనుక ఇంకా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

దాదాపుగా రెండు వందల కోట్ల వరకు ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా వసూళ్లు నమోదు అయ్యాయి. అంతటి భారీ వసూళ్లు అంటే ఖచ్చితంగా సాదారణమైన విషయం అయితే కాదు. ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల నేపథ్యంలో ఆ సినిమా యొక్క ప్రభావం అయిదు పది శాతం ఉంటుంది తప్ప భారీ గా అయితే ఉండదు అని.. జక్కన్న సినిమా కు సూపర్‌ హిట్‌ టాక్ దక్కించుకుంటే మాత్రం ఖచ్చితంగా ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా శుక్రవారం నుండి కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు ఏ ఒక్క సినిమా పోటీ పడే అవకాశం లేదు. కేవలం తెలుగు లో నే కాకుండా మరే భాష లో కూడా మార్చి 25వ తారీకున పెద్ద సినిమా లు విడుదల కావడం లేదు.

ఇప్పటికే విడుదల అయిన రాధేశ్యామ్‌ కనిపించడం లేదు.. ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా తగ్గింది. కనుక మార్చి 25న సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ ను జక్కన్న తన అల్లూరి మరియు కొమురం భీమ్‌ తో సిద్దంగా ఉన్నాడు. సరికొత్త ఇండియన్‌ రికార్డులు నమోదు అవుతాయా అనేది చూడాలి.
Tags:    

Similar News