నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ రోమ్-కామ్ మూవీ ''అంటే సుందరానికీ!". టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది
'అంటే సుందరానికీ' సినిమాలో నాని సరికొత్త గెటప్ లో కనిపించబోతుండడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ - జీరోత్ లుక్ మోషన్ పోస్టర్ మరియు బర్తడే హోమం టీజర్ మంచి స్పందన తెచ్చుకుని ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా సినిమాలోని 'పంచెకట్టు' అనే ఫస్ట్ సింగిల్ ని ఆవిష్కరించారు. ముందుగా బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ఈ పాటని రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర బృందం.. రాహుకాలం ఉందని 7.02 గంటలకు సుందరాన్ని రంగంలోకి దూకడానికి సిద్ధమవుతున్నాడని పేర్కొన్నారు.
'సారోరూ.. ఫేడైపోయే ఫ్రీడమ్ మీదింక.. ఎహ్ మీదింక.. సారోరూ.. డూపే లేకుండా ఫ్రీడమ్ ఫైటింకా.. మీతో మీకింకా..' అంటూ చమత్కారమైన లిరిక్స్ తో 'పంచెకట్టు' పాట సాగింది. వివేక్ సాగర్ ట్రెండీ ఫుట్-ట్యాపింగ్ ట్యూన్ ను కంపోజ్ చేయగా.. 'రాజ రాజ చోర' దర్శకుడు హర్షిత్ గోలి ఫన్నీ లిరిక్స్ అందించారు.
లెజెండరీ కర్ణాటక సింగర్, పద్మశ్రీ అరుణ సాయిరామ్ ఈ పాటను ఆలపించడం విశేషం. బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో ఉన్న నాని ఇందులో తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కనిపించాడు. పంచెకట్టులో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తో సహా అమెరికాలోని ప్రసిద్ధ ప్రదేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మొత్తం మీద హీరో జీవితాన్ని వివరిస్తూ సరదాగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇందులో నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు
''అంటే సుందరానికీ!" చిత్రాన్ని 2022 జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'శ్యామ్ సింగరాయ్' సక్సెస్ జోష్ లో ఉన్న నాని.. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Full View