అవినాష్‌ ఎదుగుదలకు కారణం బ్రేకప్‌ కారణమట

Update: 2020-12-12 10:59 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ఎంటర్‌ టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ గా పేరు దక్కించుకున్న అవినాష్‌ ఫైనల్‌ 5 వరకు వెళ్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇంట్లో ఉన్న కొన్ని రాజకీయాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఎలిమినేట్‌ అయ్యాడు. పల్లెటూరుకు చెందిన ఒక సాదారణ కుటుంబంకు చెందిన అవినాష్‌ బిగ్ బాస్‌ వంటి అత్యున్నత స్థాయికి వెళ్లాడు అంటే ఏ స్థాయిలో అతడు కష్టాలను ఎదుర్కొన్నాడో.. ఎంతగా తాపత్రయ పడి నిద్రలేని రాత్రులను గడిపాడో అర్థం చేసుకోవచ్చు. అయిదుగురిలో ఒక్కడిగా ఉన్న అవినాష్‌ పట్టుదలతో సినిమాపై ఆసక్తితో మిమిక్రీని నేర్చుకుని గుర్తింపు దక్కించుకున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అవినాష్‌ బిగ్ బాస్‌ అనుభవాలు మరియు ఇతర విషయాల గురించి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ సందర్బంగా అవినాష్‌ మాట్టాడుతూ.. సినిమాలపై పిచ్చితో మిమిక్రీ నేర్చుకున్నాను. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాను. తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయిని ప్రేమించాను. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని ఆమె వెళ్లి పోయింది. ఆమె కుళ్లుకునే విధంగా ఉన్నత స్థాయికి వెళ్లాలి అనేది నా కోరిక. అందుకే నేను చాలా కష్టపడ్డాను. ఎంతో మంది వద్ద పని చేశాను. ముందు ముందు మరింతగా ఉన్నత స్థాయికి వెళ్తాను అంటూ అవినాష్‌ చెప్పుకొచ్చాడు.

బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ లేదా అరియానా అవుతారని నమ్మకంగా ఉందని చెప్పుకొచ్చాడు. అరియానా నా స్నేహితురాలు అవ్వడం వల్ల ఆమె గెలిస్తే నేను గెలిచినట్లుగానే భావిస్తాను అన్నాడు. బిగ్‌ బాస్‌ లో ప్రతిభ చూపించుకోవడానికి చాలా స్కోప్‌ ఉంటుందని. ప్రతిభ ఉన్న వారు వారి ప్రతిభను చూపడంకు బిగ్‌ బాస్‌ మంచి వేదిక అన్నట్లుగా పేర్కొన్న అవినాష్‌ బిగ్‌ బాస్‌ అనేది తన కెరీర్‌ కు టర్నింగ్‌ గా భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

Tags:    

Similar News