ది క్యూరియస్ కేస్ ఆఫ్ `లోనావాలా మిస్టరీ`.. ప్రస్తుతం వెబ్ లో ట్రెండింగ్ డిబేట్ ఇది. `వై కట్టప్ప కిల్డ్ బాహుబలి`లాగా..! ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 వీక్షించిన అభిమానులను వెంటాడుతున్న ఆసక్తికర ప్రశ్న ఇది. అసలు దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే లోనవాలా మిస్టరీని ఎందుకని ఓపెన్ చేయలేదు. దానిని అలానే సస్పెన్స్ లో ఎందుకని ఉంచారు? అంటూ సోషల్ మీడియాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
నిజానికి మనోజ్ భాజ్ పాయ్ (శ్రీకాంత్ తివారీ) కి తెలియకుండా ప్రియమణి (సుచీ) జాబ్ పేరుతో శరద్ కేల్కర్ (అరవింద్) తో కలిసి విదేశాలకు వెళుతుంది. అక్కడ ఏం జరిగింది? అన్నది మాత్రం రివీల్ కాలేదు. సీజన్ 2లో ఆ గుట్టు విప్పుతారని ఆశించిన వారంతా దీనిని సస్పెన్స్ గా ఉంచడానికి కారణమేంటో తెలీక బుర్రలు పీక్కుంటున్నారు! వీరిద్దరి మధ్య లోనావాలాలో ఏం జరిగిందో... సమాధానం కోసం నిరీక్షించినా ఆన్సర్ లేనేలేదు. రెండేళ్లకు పైగా ప్రేక్షకులు వేచి చూస్తే ఆ సస్పెన్స్ వీడనేలేదు. వాస్తవానికి.. సీజన్ 2 లో లోనావాలా మిస్టరీని మేకర్స్ ఓపెనప్ చేస్తారని ప్రేక్షకులు భావించారు. అయితే సృష్టికర్తలు రాజ్ నిడిమోరు - కృష్ణ డికె యాధృచ్ఛికంగానే దీనిని గమనించకుండా వదిలేశారు. దానివల్ల సిరీస్ అస్పష్టమైన ముగింపుతో కనిపించింది.
సుచీ వ్యవహారంలో మేకర్స్ దేనినీ దాచలేదు.. కానీ ఏం జరుగుతుందో ఇండికేషన్ మాత్రం ఇచ్చారు. ఏదో జరిగింది. అది ఏంటో మీకు తెలుసు! అన్న సస్పెన్స్ ని లీడ్ చేశారు! ప్రేక్షకులే తమకు తాముగా కనుగొంటారని మేము నిర్ణయించుకున్నామని రాజ్ అండ్ డీకే తెలిపారు. మీ అందరికీ ఏదో జరుగుతోందని అర్ధమవుతుంది. ఏమి జరిగిందనే దానిపై శ్రీకాంత్ తివారీ (మనోజ్ భాజ్ పాయ్)కు కూడా అనుమానం ఉంది. కానీ అతను తెలుసుకున్నప్పుడు మీరు కనుగొంటారు అని డికె అన్నారు. ఓవరాల్ గా లోనవాలా మిస్టరీ క్యూరియాసిటీని పెంచింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
అసలేమైందో ఆడది కాబట్టి తెలుసుకోవాలనుకుంటారు. అందుకే చెప్పలేదు గుట్టు విప్పలేదు.. ఏదో జరిగింది. అది ఏంటో మీకు తెలుసు! అన్నదే స్క్రీన్ ప్లే జిమ్మిక్ అన్నమాట . ``ప్రదర్శన నడుస్తున్నంత కాలం ఇది ఎప్పటికీ సమాధానం ఇవ్వకూడదని నేను భావిస్తున్నాను. దానికి ఎందుకు సమాధానం చెప్పాలి? సుచి ఎందుకు తన సొంత మహిళ కాదు.. ఆమె సొంత జీవితం గోప్యతను కలిగి ఉండకూడదు?`` అందుకే ఆ రహస్యం నిజంగా స్పష్టంగా చెప్పలేదు. ప్రేక్షకులు తమకు తామే ఆ రహస్యం కనుగొనాలనే వదిలేశామని అన్నారు.