`క్రాక్` సినిమాతో ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది `ఖిలాడీ`, `రామారావు ఆన్ డ్యూటీ` వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్ లని సొంతం చేసుకుని గట్టి షాకిచ్చాడు. `రామారావు ఆన్ డ్యూటీ` టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీపై రవితేజ తో పాటు అభిమానులు కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలని తలకిందులు చూస్తూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుంది. రవితేజకు బిగ్ షాకిచ్చింది.
దీంతో అందరి దృష్ణి `ధమాకా`పై పడింది. వింటేజ్ రవితేజని టీజర్, ట్రైలర్ లలో చూపించిన తీరు, జింతాత.. పాటలో మాస్ రాజా హంగామా చూసి ఈ సారి రవితేజ గట్టిగా కొట్టేలా వున్నాడే అనుకున్నారు. వరుసగా హ్యాట్రిక్ హిట్లని దక్కించుకున్నడైరెక్టర్ త్రివినాథరావు నక్కిన, రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఇది కూడా వాటి సరసన చేరుతుందని అంతా భావించారు. టీజర్, ట్రైలర్, సాంగ్ లతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆ అంచనాల్ని తలకిందులు చేసింది. త్రివిక్రమ్ అరగదీసిన కథనే ప్రసన్న కుమార్ బెజవాడ మరోసారి అటు ఇటుగా మార్చి మళ్లీ రవితేజతో చేయడంతో జనాలు ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు. ఓ కంపనీని లేకోవర్ చేసుకోవడం కోసం రంగంలోకి దిగడం అనే రొటీన్ ఫ్లాప్ స్టోరీనే ఈ మూవీకీ ఎంచుకున్నారు. ఇదే ఈ మూవీకి ప్రధాన మైనస్ గా నిలిచి షాకిచ్చింది. ఫస్ట్ హాఫ్ ని కొంత వరకు ఆసక్తిగా నడిపించినా సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి దర్శకుడు, రైటర్ చేతులెత్తేసి అడ్డంగా దొరికి పోయారు. దీంతో ఫలితం తారుమారైంది.
ఫైనల్ గా `ధమాకా` ఫలితం తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇంచు మించి ఇదే తరహా కథతో విశ్వక్ సేన్ నటిస్తున్న `దాస్ కా ధమ్కీ`పై అందరి దృష్టిపడింది. `ధమాకా` చిత్రానికి కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడనే ఈ సినిమాకూ కథ అందించాడు. సిమిలర్ పాయింట్ తో ఒకే కథని ఇద్దరు హీరోలకు అందించాడనే ఆరోపణలతో ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ ఈ మూవీని తెరకెక్కించాడు. ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న `దాస్ క ధమ్కీ` మాస్ కా దాస్ కు ఇదే ఫలితాన్నిస్తుందా? లేక ఊహించని విధంగా సక్సెస్ ని అందిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.