ది రింగ్స్ ఆఫ్ పవర్... ప్రపంచం మొత్తం చూస్తోంది

Update: 2022-09-03 05:43 GMT
అమెజాన్‌ ప్రైమ్‌ చరిత్రలోనే అతి భారీ బడ్జెట్‌ తో రూపొందించిన వెబ్‌ సిరీస్ ది రింగ్స్ ఆఫ్ పవర్. ఈ వెబ్‌ సిరీస్‌ హాలీవుడ్‌ సినిమాలతో పాటు సూపర్ హిట్‌ వెబ్ సిరీస్ లను బీట్ చేస్తుంది అంటూ అమెజాన్ చాలా నమ్మకంగా ఉంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన సిరీస్ లకు ఈ వెబ్‌ సిరీస్ కచ్చితంగా పోటీని ఇస్తుందని వారు విశ్వసించారు.

సెప్టెంబర్‌ 1వ తారీకున ఈ వెబ్‌ సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కోసం ఇండియాలో కూడా అత్యధికులు ఎదురు చూశారు. ఇండియన్స్ నమ్మకాలకు కాస్త దగ్గరగా ఈ వెబ్ సిరీస్ ఉండటంతో పలు ఇండియన్‌ భాషల్లో విడుదల చేయడంతో పాటు పలు భాషల్లో సబ్ టైటిల్స్ ను కూడా అందుబాటులో ఉంచారట.

ఇండియాలోనే కాకుండా ఈ వెబ్‌ సిరీస్ సందడి దాదాపుగా వంద దేశాల్లో ఉందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ వెబ్‌ సిరీస్ ను ప్రస్తుతానికి 32 భాషల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. త్వరలో ఈ భాష 50 కి పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎపిసోడ్‌ లు విడుదల అయ్యే కొద్ది అంచనాలు భారీగా పెరుగుతాయి అంటున్నారు.

మొదటి ఎపిసోడ్‌ కు గూగుల్‌ లో 10 కి గాను 7.5 రేటింగ్ వచ్చింది. ముందు ముందు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌ అయ్యి వాటి యొక్క ఆధరణ బాగుంటే తప్పకుండా ఈ రేంటింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి ఎపిసోడ్‌ కే ఈ స్థాయి రేటింగ్ అంటే కచ్చితంగా ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క విజయం గా చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓటీటీ ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్ ను చూస్తున్నట్లుగా అమెజాన్ పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News