ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' షూటింగ్ ప్రస్తుతం విశాఖ మన్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియో లీక్ కావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పలు మీడియా సంస్థలు ఇప్పటికే షేర్ చేశాయి.
అయితే 'RRR' టీమ్ వెంటనే రంగంలోకి దిగి ట్విట్టర్.. ఫేస్ బుక్ పేజిలలో షేర్ చేసిన వీడియోను తీయించారు. లీకేజ్ జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకునేందుకు యాంటి పైరసీ టీమ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు 'RRR' టీమ్. ఈ టీమ్ రంగంలోకి దిగి వెబ్ సైట్ల నుంచి.. ఇతర ట్విట్టర్.. ఫేస్ బుక్ పేజీల నుండి ఈ లీక్ వీడియోను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి ఏదైనా వీడియో క్లిప్ లీకైతే దాన్ని సోషల్ మీడియాలో పూర్తిగా లేకుండా చేయడం వీలుకాదు. అయితే వెబ్ సైట్స్.. ఇతర ప్రముఖ మీడియా సంస్థలలో లేకుండా 'RRR' సోషల్ మీడియా టీమ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం 'RRR' టీమ్ చొరవను మెచ్చుకోకుండా ఉండలేం.
అయితే ఆ వీడియోను వెంటనే డౌన్లోడ్ చేసుకున్న కొందరు నెటిజన్లు మాత్రం వాట్సాప్ లాంటి మొబైల్ యాప్స్ లో మాత్రం సర్క్యులేట్ చేస్తున్నారని సమాచారం. ఇలా లీక్ వీడియోను సర్క్యులేట్ చేసే వారిని ఆపడం అంత సులువు కాదు. మరి ఈ విషయంలో 'RRR' టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.