దేశీ గాళ్ అంటూ `దోస్తానా` బాబులు తన వెంట పడినప్పుడు పీసీ ఎక్స్ ప్రెషన్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఆ సినిమాలో దేశీ గాళ్ సాంగ్ యాథృచ్ఛికమే అయినా ఈ అమ్మడికి దేశవిదేశాల్లో ఉన్న ఫాలోయింగ్ మాత్రం యాథృచ్ఛికం కాదు. పీసీ దేశీనే అయినా పరదేశీ అయ్యింది. విదేశీ కోడలు అయ్యి స్వదేశీ పరిశ్రమను మరిచిందన్న విమర్శల్ని ఎదుర్కొంది. అయితేనేం.. ఇండియా దాటి వెళితేనేం.. అమెరికా కోడలుగా లైఫ్ లో ప్రతి అణువును చిద్విలాసంగా ఆస్వాధిస్తోంది. తాను ప్రేమించిన అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ తో సంసార జీవనాన్ని ఎంతో అన్యోన్యంగా సాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తోంది పీసీ.
ప్రియాంకా చోప్రా- నిక్ జోనాస్ జంట రొమాంటిక్ లైఫ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సోషల్ మీడియాలో నిరంతరం రొమాంటిక్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినా.. లేదా ఏవైనా విదేశీ వెకేషన్లకు వెళ్లినా అక్కడి నుంచి నిరంతరం వేడెక్కించే రొమాంటిక్ ఫోటోల్ని ఈ జంట షేర్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇద్దరూ కలిసి క్వారంటైన్ లో ఉన్నారు. జంటగా కలిసి ఉండటంతో ఈ క్షణాల్ని బాగా ఆస్వాధిస్తున్నారు. ఇకపోతే కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో ప్రియాంక చోప్రా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా గత నెలలో ప్రియాంక - నిక్ అనేక స్వచ్ఛంద సంస్థలకు సహకరించారు. పిఎం-కేర్స్ ఫండ్- యునిసెఫ్- ఫీడింగ్ అమెరికా- గూంజ్ వంటి సంస్థలకు తాము విరాళం ఇచ్చినట్లు ప్రియాంక ట్విట్టర్ లో వెల్లడించింది. ఆరోగ్య సంక్షోభంలో ప్రమాదకర పరిస్థితుల నడుమ తమ వంతు కృషి చేస్తున్న మహిళలకు లక్ష డాలర్లు విరాళంగా అందిస్తామని పీసీ హామీ ఇచ్చింది. ఆ సంగతుల్ని షేర్ చేయడం ద్వారా అభిమానులను చైతన్యవంతం చేస్తోంది.
తాజాగా భర్త నిక్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని పీసీ షేర్ చేసింది. ఈ ఫోటోకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఫోటోలో పూల ప్రింట్ ఉన్న నీలం రంగు చీరను ధరించింది. దానికి వెండి రంగు స్లీవ్ లెస్ జాకెట్ కాంబినేషన్ తో మైమరిపించింది. భారతీయతను ప్రతిబింబిస్తున్న ఈ చీరకు తగ్గట్టే చేతులకు చక్కని గాజులు ధరించింది. తన జుట్టు కురులను ఓపెన్ గా అలా విరబోసింది. ఈ ఫోటోలో భర్త నిక్ వైపు పీసీ తథేకంగా చూస్తోంది. ``చీర ధరించాలని అనిపించింది.. అందుకే కట్టుకున్నా .. ఇంట్లో అందరినీ మిస్సయ్యాను. నిక్ జోనాస్ చెంతనే ఉన్నాను`` అని పీసీ తెలిపింది. మొత్తానికి పీసీ-నిక్ జంట సంథింగ్ స్పెషల్ అని దీనిని బట్టి దేశీ బోయ్స్ ఫీలవ్వాలన్నమాట.