సెకండ్ వేవ్ మే5తో అంతం.. మ‌హేష్ ఏమ‌న్నారంటే!

Update: 2021-04-21 06:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ ఎప్ప‌టికి బ‌ల‌హీన‌ప‌డుతుంది? ఈ ప్ర‌శ్నకు విశాఖ శార‌దాపీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామి మే 5తో అంత‌మ‌వుతుంద‌ని భాస్యం ప‌లికారు. భార‌త‌దేశానికి గ్ర‌హానుకూల‌త స్థితిగ‌తుల‌ను ప‌రిశీలించి చెప్పారు స్వామీజీ. అది నిజ‌మ‌వ్వాల‌నే దేశం ఆశిస్తోంది.

ఇక‌పోతే సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేసిన ప్ర‌క‌ట‌నా ఆస‌క్తిని క‌లిగించింది. కరోనావైరస్ రెండవ వేవ్ పెద్ద దెబ్బ కొడుతుండ‌డంతో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని మహేష్ ఒక సందేశాన్ని విడుదల చేశారు. గత సంవత్సరం కొరోనావైరస్ మొదటి వేవ్ వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల్ని ఆయ‌న అప్ర‌మ‌త్తం చేశారు.

ఇప్పుడు మ‌రోసారి జ‌న‌జాగృతం చేసేందుకు త‌నవంతు సందేశాన్నిచ్చారు. ``అసాధారణమైన సమయాల్లో అసాధారణ చర్యలు అవసరం!  మాస్క్ ని ధరించండి.. శుభ్రపరచండి.. ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి.. టీకాలు వేయించండి. మ‌నం ఇంతకు ముందే ఇది ఎదుర్కొన్నాం. మళ్ళీ చేద్దాం యుద్ధం. మాస్క్ ని ధరించండి - సురక్షితంగా ఉండండి - బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి``

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సర్కారు వారి పాట సంక్రాంతి 2022 కి విడుదల కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో షూటింగ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. సెకండ్ వేవ్ వ‌ల్ల ప్ర‌స్తుతం ఈ సినిమా వాయిదా ప‌డింది. దుబాయ్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News