రేణు దేశాయ్ లో ఈ వేదాంత‌మేల‌ సోద‌రా?

Update: 2020-03-30 07:00 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్-రేణు దేశాయ్ జంట‌ విడాకులు తీసుకుని ఎవ‌రి జీవితంలో వారు స‌ప‌రేట్ అన్న‌ట్టుగానే ఉంటున్న వైనం తెలిసిందే. అయితే పిల్ల‌ల భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకుని అప్పుడ‌ప్పుడు క‌ల‌వ‌డం వారి ఆల‌నా పాల‌నా చూడ‌డం చూస్తున్నారు అభిమానులు. పిల్ల‌లు అకీరా.. ఆద్య స్కూల్ హాలీడేస్ లో...పండుగల‌ స‌మ‌యంలో  మెగా ఫ్యామిటీ న‌ట్టింట‌ సంద‌డి చేస్తుంటారు. పిల్ల‌లకు అమ్మ‌..నాన్న క‌లిసే ఉన్నార‌న్న అనుభూతినిచ్చేందుకు ఆ జోడీ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ప‌వ‌న్ తో రేణు దేశాయ్ అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో ఇష్ట‌ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ క్ర‌మంలో ప‌వ‌న్ ఇష్టా ఇష్టాల‌ను.. వ్య‌క్తిత్వాన్ని  రేణు ఎంతో అర్ధం చేసుకున్నారు. ఆ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ప‌లు వేదిక‌ల‌పై వెల్ల‌డించారు కూడా. ప‌వ‌న్ పై అభిమానంతో ఫ్యాన్స్ త‌న‌ని అంటున్నా.. వారించే ప్ర‌య‌త్న‌మే చేశారు ప్ర‌తిసారీ..

ఇక రేణు మ‌రికొన్నిటినీ ప‌వ‌న్ నుంచి తెలుసుకున్న‌వి అస్స‌లు విడిచి పెట్ట‌లేద‌ట‌.  ప‌వ‌న్ ఆద‌ర్శ భావాల‌ను మాత్రం రేణు అస్స‌లు విడిచిపెట్ట‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌తంగా ఎంత సింపుల్ గా ఉంటారో అంద‌రికి తెలిసిందే. అనుకోకుండా స్టార్ అయ్యారు. నాయ‌కుడ‌య్యారు.. లేదంటే ప‌వ‌న్ జీవితం ఇంకా సింపుల్ గా సాగిపోయేది. తోట‌లో రెండు ఆవుల‌ను పెంచుకుంటూ.. మొక్క‌లు పెంచుకుని.. కూర‌గాయ‌లు సాగు చేస్తూ.. సాధార‌ణ జీవితం గ‌డిపేసేవాడిన‌ని..ఇప్ప‌టికీ అలాగే ఉండాల‌నిపిస్తుంద‌ని ప‌వ‌న్ ఎన్నో వేదిక‌ల‌పై చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప‌వ‌న్ తో జీవితాన్ని పంచుకుని దూర‌మైనా రేణు లో ప‌వ‌న్ భావ‌జాలం బ‌లంగానే ఉంద‌ని తాజా రివీల్ అయిన వీడియోని బ‌ట్టి తెలుస్తోంది. రేణు తన త్రోబ్యాక్  సినిమా షూటింగ్ లో భాగంగా త‌న లైఫ్ స్టైల్ కి ఇష్ట‌మైన కొన్ని దృశ్యాల‌ను ఓ వీడియో చేసి దాన్ని ఇన్ స్టా లో అభిమానుల‌కు షేర్ చేసింది.

అందులో రేణు  గ్రామంలోని పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపింది. వాళ్ల జీవితం చాలా సింపుల్ గా హ్యాపీగా ఉంటుంది ! అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి జీవితాన్ని తాను మిస్ అయ్యాన‌ని..ఇలాంటి వాతావ‌ర‌ణం త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. అలాగే ప‌ది పిల్లి పిల్ల‌లు... ప‌ది కుక్క పిల్ల‌ల్ని పెంచుకుంటూ జీవితాన్ని ఎంతో సంతోషంగా గ‌డిపేయొచ్చు అంటూ త‌న‌లోని వేదాంతాన్ని వ‌ల్లించారు. ఆ చిన్నారుల‌తో గ‌డిపిన ఈ రోజు ఓ స్వ‌ర్గంలా భావిస్తున్నాన‌ని అన‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇది ర‌క‌ర‌కాల మ‌న‌స్త‌త్వాలున్న ప్ర‌స్తుత స‌మాజంలో జీవించ‌డం వ‌ల్ల పుట్టుకొచ్చిన కొత్త ఫిలాస‌ఫీనా.. లేక ప‌వ‌న్ ప్ర‌భావ‌మా? అన్నది కాస్త ఆలోచించాలి.
Tags:    

Similar News