సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవలీలగా వందల కోట్ల వసూళ్ళు రాబడుతున్నాయి. ముఖ్యంగా గత ఆరేడు ఏళ్లలో మన చిత్రాల మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. దీనికి బాటలు వేసింది మాత్రం 'బాహుబలి' మూవీ అని చెప్పాలి.
ఒకప్పుడు దక్షిణాది చిత్రాలు 100 కోట్ల షేర్ - 200 కోట్ల గ్రాస్ అందుకుంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ 'బాహుబలి' తర్వాత ఈ లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు మన సినిమాలు వేల ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల గ్రాస్ రాబడుతున్న తరుణంలో.. వంద, రెండు వందల కోట్లు అనేవి మినిమమ్ బెంచ్ మార్క్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ₹400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
* 'బాహుబలి' (2015) : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ''బాహుబలి - ది బిగినింగ్''. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన ఈ విజువల్ వండర్ ఇది. ఆర్కా మీడియా బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
* 'బాహుబలి 2' (2017) : 'బాహుబలి' చిత్రానికి కొనసాగింపుగా ప్రభాస్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ''బాహుబలి - ది కన్క్లూజన్''. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు వసూలు చేసి హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న రెండో భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది.
* '2.O' (2018) : 'రోబో' చిత్రానికి సీక్వెల్ గా.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 709 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ - బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మాత్రం.. దీన్ని ప్లాప్స్ లిస్టులోనే చేర్చాల్సి ఉంటుంది.
* 'సాహో' (2019): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మించారు. 'బాహుబలి' తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే హిందీలో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. ఓవరాల్ గా 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. థియేట్రికల్ బిజినెస్ తో కంపేర్ చేస్తే.. సినిమా వల్ల 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
* 'RRR' (2022) : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ''రౌద్రం రణం రుధిరం''. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఈ ఏడాదిలో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
* 'KGF 2' (2022): కన్నడ హీరో యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'కేజీఎఫ్: చాప్టర్ 2'. బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్' కు కొనసాగింపుగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.
* 'విక్రమ్' (2022): యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. 1986లో కమల్ నటించిన 'ఏజెంట్ విక్రమ్' చిత్రంలోని పాత్రను తీసుకొని ఈ కథను అల్లుకున్నారు. విజయ్ సేతుపతి - ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.
ఇప్పటికైతే వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాల లిస్టులో ఈ ఏడు ఉన్నాయి. అందులో నాలుగు టాలీవుడ్ నుంచి వస్తే.. కోలీవుడ్ నుంచి రెండు - శాండిల్ వుడ్ నుంచి ఒక సినిమా వచ్చాయి. దక్షిణాది ఫిలిం మేకర్స్ ప్రస్తుతం అత్యున్నత ప్రమాణాలతో సినిమాలను రూపొందిస్తున్నారు కాబట్టే.. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ జాబితాలో ఇంకెన్ని సినిమాలు చేరుతాయో చూడాలి