'నవంబర్ స్టోరీ' ట్రైలర్: మర్డర్ కేసులో తండ్రిని కాపాడాలని ట్రై చేసే కూతురి కథ
సౌత్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టి '11థ్ అవర్' అనే తెలుగు సిరీస్ తో మెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు ''నవంబర్ స్టోరీ'' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో మే 20 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా 'నవంబర్ స్టోరీ' ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
'నవంబర్ స్టోరీ' ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటమే కాకుండా ఈ సిరీస్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది. మీకు ఇష్టమైన వారిని రక్షించడానికి ఎంత దూరం వెళతారు? అనే లైన్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ కుమార్తె అనురాధ పాత్రలో తమన్నా నటించింది. లాక్ చేయబడిన తన ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఆ వ్యక్తిపై 47 సార్లు పెన్నుతో పొడిచిన హంతకుడు.. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా మృతదేహంపై పెయింట్ పోస్తాడు. సవాలుగా మారిన ఈ కేసులో తమన్నా తండ్రి ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్న తమన్నా ఆయన్ని ఈ మిస్టరీ మర్డర్ నుండి బయటపడేసిందా? నిజమైన నేరస్థులను పోలీసులకు ఎలా పట్టించింది? నవంబర్ నెలకు ఈ కథకు లింకేంటి? అనేది తెలియాలంటే 'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇందులో తమన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించినట్లు అర్థం అవుతోంది. తమన్నా తండ్రి పాత్రలో జీఎం కుమార్ నటించగా.. పశుపతి - వివేక్ ప్రసన్న - అరుల్ దాస్ - నందిని ఇతర కీలక పాత్రలు పోషించారు.
'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ కి తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రహ్మణ్యం రచన మరియు దర్శకత్వం వహించారు. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సిరీస్ రూపొందింది. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించగా.. శరన్ గోవిందస్వామి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. శరన్ రాఘవన్ సంగీతం సమకూర్చగా.. ఎ రాజేష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మిల్కీ బ్యూటీకి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.
Full View