టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కొనసాగుతున్నారు. ఇన్నాళ్లు నైజాం అంటే దిల్ రాజు.. దిల్ రాజు అంటే నైజాం అనే నానుడి ఉంది. అయితే ఇప్పుడు దానికి స్వస్తి పలకడానికి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు వెనకుండి పావులు కదుపుతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి నిదర్శనంగానే మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' నైజాం హక్కులు దిల్ రాజుకు దక్కలేదనే టాక్ నడుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉప్పెన' సినిమా గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సి ఉంది. అప్పుడే దీని నైజాం ఏరియా రైట్స్ దిల్ రాజు అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నారట. అయితే ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చి ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాన నైజామ్ ఏరియా హక్కుల్ని దిల్ రాజుకు ఇవ్వకుండా మైత్రీ వారు సొంత కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు కాంపౌండ్ నుంచి మైత్రీ టీమ్ కు కంటిన్యూగా కాల్స్ వెళ్తున్నా ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వడం లేదని అనుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే నైజాం కూడా మెల్లిగా ఈ మోనోపోలి నుంచి బయటకొచ్చి ఆంధ్ర ఏరియా మాదిరి తయారయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.