కొంత మంది ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని అసలే పట్టించుకోరు. తమకు ఏది సరైందని అనిపిస్తే అది చేసేస్తారు. సమయం సందర్భం కూడా లెక్కచేయరు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. ఆయన తాజాగా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. నడి రోడ్డుమీద ఓ మహిళతో చేయించిన పనిపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
మిలింద్ ఫిట్నెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు, అభిమానులకు హెల్త్ టిప్స్ కూడా బోధిస్తారు. 53ఏళ్ల వయసులో ఉన్నా.. ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉండడానికి ఆయన ఫిట్నెస్ చర్యలే కారణం. అయితే.. ఇదే ఫిట్నెస్ కోణంలో ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
మిలింద్ రాయ్ పూర్ వెళ్లిన సందర్భంగా అతన్ని గుర్తించిన ఓ మహిళ.. సెల్ఫీ కోరింది. అయితే.. సెల్ఫీ ఇస్తాను కానీ.. ఓ పని చేయాలని చెప్పాడు. రోడ్డు మీదనే పది పుషప్స్ తీస్తే సెల్ఫీ ఇస్తానని చెప్పాడు. దీంతో.. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా రోడ్డుపైనే పుషప్స్ తీయడం మొదలు పెట్టింది. ఆమె వయసు 40 పైనే ఉండడం.. ఆమె చీరకట్టులో ఉండడం గమనార్హం.
ఈ వీడియోలో ఆమె రోడ్డు పక్కనే వర్కవుట్స్ చేస్తూ కనిపించారు. పక్కన ఉన్నవారంతా ఓ వింత చర్యగా చూశారు. అయినప్పటికీ.. ఆమె పట్టించుకోకుండా కోటా కంప్లీట్ చేసింది. మిలింద్ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డుపై ఇంత అతి చేయించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆలోచన మంచిదే కావొచ్చు కానీ.. బజారులో ఇలా చేయించడం మాత్రం సరికాదని అంటున్నారు.
Full View