ఈమద్య కాలంలో సౌత్ స్టార్ హీరోల సినిమాల పారితోషికాలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవర్సీస్.. ఓటీటీ.. శాటిలైట్ ఇలా భారీ ఎత్తున సినిమాలకు రైట్స్ రూపంలో డబ్బు వచ్చి పడుతున్న నేపథ్యంలో హీరోలు తమ స్టార్ డమ్ కు తగ్గట్లుగా పారితోషికం ఇవ్వాల్సిందే అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నాడు. హీరోగా ఒక్క హిట్ పడితే చాలు కోట్లలో పారితోషికం పెంచుతున్న హీరోలు ఉన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ హీరోల పారితోషికాలు ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు బాలీవుడ్ హీరోల కంటే చాలా అధికంగా సౌత్ స్టార్ హీరోలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో మెజార్టీ హీరోలు పది కోట్లు అంతకు తక్కువ పారితోషికం తీసుకుంటున్నారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు కొద్దిమంది ఉన్నారు. వారిలో షాహిత్ కపూర్ ఒకరు. హిందీ అర్జున్ రెడ్డి అయిన కబీర్ సింగ్ సక్సెస్ తో ఈయన స్థాయి పెరిగింది.
కబీర్ సింగ్ లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ కు ఇరవై నుండి పాతిక కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా హిట్ తో షాహిద్ కపూర్ రేంజ్ అమాంతం పెరిగింది. ఆ సినిమా తర్వాత చేసిన జెర్సీ సినిమాకు గాను షాహిద్ 35 కోట్ల రూపాయలను నిర్మాతల నుండి షాహిద్ కపూర్ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
తాజాగా ఈయన నటిస్తున్న కొత్త సినిమాలకు మరియు త్వరలో కమిట్ అవ్వబోతున్న సినిమాలకు గాను ఏకంగా 40 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. 40 కోట్ల పారితోషికం కు ఓకే అయితేనే ఈయన కథ వింటాను అంటున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జెర్సీ సినిమా కమర్షియల్ గా తీవ్రంగా నిరాశ పర్చింది. హిందీ జెర్సీ సినిమా తో షాహిద్ కపూర్ తన పారితోషికం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు భావించారు. కాని అనూహ్యంగా జెర్సీ ఫలితంతో సంబంధం లేకుండా షాహిద్ కపూర్ తన రెమ్యూనరేషన్ ను పెంచేశాడు.
ప్రస్తుతం ఈయన ప్రతి సినిమా కు కూడా 40 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉండగా ఒక్కటి రెండు సినిమాలు సక్సెస్ అయితే యాబై కోట్ల వరకు ఈయన మార్కెట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాప్ పడ్డా కూడా ఈ స్థాయిలో పారితోషికం ను పెంచడం కేవలం ఈయనకే చెల్లింది అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.